గంగసాని(అంకుశం) రామిరెడ్డి,Ankusam Rami Reddy

పరిచయం (Introduction) :
  • స్పాట్‌ పెడ్తా... అంటూ ప్రతినాయక పాత్రలకు జీవం పోసిన నటుడు రామిరెడ్డి. ఆయన గురువారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. 'అంకుశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో ప్రతినాయక పాత్రలో ఒదిగిపోయారు. అందులో రామిరెడ్డి పలికిన స్పాట్‌ పెడ్తా అన్న డైలాగ్‌ ప్రాచుర్యం పొందింది. తొలి చిత్రమే విజయవంతం కావడంతో వరుసగా అవకాశాలొచ్చాయి. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, భోజ్‌పురి భాషల్లోనూ నటించారు. 250కిపైగా చిత్రాల్లో నటించిన రామిరెడ్డికి చివరి చిత్రం 'మర్మం'. ఎక్కువ ప్రతినాయకుడిగానే కనిపించినా 'పెద్దరికం', 'అనగనగా ఒక రోజు' లాంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. దాదాపు అన్ని భారతీయ భాషలలో నటించాడు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : రామిరెడ్డి.గంగసాని,
  • వయసు : 55 సంవత్సరాలు - ,
  • పుట్టిన ఊరు : ఓబుళంవారిపల్లె - వాయల్పాడు దగ్గర -- చిత్తూరు జిల్లా,
  • కుటుంబం : భార్య , ఇద్దరు కుమారులు , ఒక కుమార్తె .
  • నివాసము : హైదరాబాద్ ,
  • మరణము : 14-ఏప్రిల్ 2011-- మూత్రపిండాల వ్యాధి తో చికిత్స పొందుచూ మరణించారు ,
కెరీర్ (సిన్మారంగ ప్రవేశము ) :
  • జర్నలిజమ్‌లో డిప్లొమా పొందిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఉర్దూ పత్రికలో పాత్రికేయుడిగా ఉద్యోగం చేశారు. 'అంకుశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. రామిరెడ్డి మంచి బాస్కెట్‌బాల్ ప్లేయర్ కూడా. ఉస్మానియా యూనివర్సిటీలో బీసీజే చేసిన ఆయన సినిమాల్లోకి రాకముందు మున్సిఫ్ పత్రికలో విలేకరిగా కూడా పనిచేశారు.
నటించిన కొన్ని సినిమాలు (filmography ): తెలుగు సినిమాలు :
  • అంకుశం
  • అమ్మోరు ,
  • జగదేక వీరుడు అతిలోక సుందరి ,
  • క్షణం క్షణం ,
  • 420,
  • బలరామకృష్ణులు ,
  • పెద్దరికం,
  • గాయం,
  • అంగరక్షకుడు,
  • అల్లరి ప్రేమికుడు ,
  • అనగనగా ఒకరోజు ,
  • ఒసేయ్‌ రాములమ్మ ,
  • అంజి,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala