Peethambaram M, మేకప్మెన్ పీతాంబరం

పరిచయం (Introduction) :
  • పీతాంబరం తెలుగులో ఎన్టీఆర్‌, తమిళంలో ఎమ్‌జీఆర్‌, నంబియార్‌లకు వ్యక్తిగత మేకప్‌మేన్‌గా వ్యవహరించారు.పురాణ పురుషుల పాత్రలకు మేకప్‌ వేయడంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది.
  • శ్రీకృష్ణుడు, శ్రీరాముడు... అనగానే మనకు నందమూరి తారకరామారావు రూపమే గుర్తుకొస్తుంది. ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణులు ఎమ్‌.పీతాంబరం. ఆయన సోమవారం 21-02-2011 సాయంత్రం చెన్నైలో తుది శ్వాస విడిచారు. పీతాంబరం వయసు 90 సంవత్సరాలు. శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళభైరవి, లవకుశ తదితర చిత్రాలకు పీతాంబరం పని చేశారు. చిత్ర నిర్మాణంలోనూ ఆయనకు అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో 'అన్నదమ్ముల అనుబంధం', 'యుగంధర్‌' చిత్రాల్ని నిర్మించారు. అలాగే 'పంభూతాలు' చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. నందమూరి బాలకృష్ణ దర్శకత్వంలో 'నర్తనశాల' చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్‌ బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్‌ తరవాత ఆగిపోయింది. ప్రముఖ దర్శకుడు పి.వాసు - పీతాంబరం కుమారుడే!దక్షిణాదిన సంచలనం సృష్టించిన చంద్రముఖి, నాగవల్లి చిత్రాలకు వాసే దర్శకుడు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : పీతాంబరం .యం,
  • వయసు : 90 సం.లు ,
  • ఊరు : గోపాలపురం - చెన్నై ,
  • మరణము : 21-ఫిబ్రవరి -2011 సోమవారము ,
  • భార్య : కమల ,
  • పిల్లలు : కొడకకులు -- విధ్యా సాగర్ ,వాసు , విమల్ . కుమార్తెలు --వనజ , విజయలక్ష్మి ,
కొన్ని మేకప్ మేన్‌ గా చేసిన సినిమాలు (filmography ):
  • శ్రీకృష్ణార్జున విజయం,
  • అగ్గిబరాటా,
  • గుండమ్మ కథ,
  • మిస్సమ్మ,
  • పాతాళభైరవి,
  • లవకుశ,
  • అన్నదమ్ముల అనుబంధం,
  • యుగంధర్‌,
  • పంభూతాలు,
మూలము : తెలుగు దినపత్రికలు 23/02/2011
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala