Monday, January 24, 2011

సాయికుమార్ , Saikumar

పరిచయం (Introduction) :
 • డబ్బింగ్‌ కళకు హీరో ఇమేజ్‌ తెచ్చిపెట్టిన ప్రతిభావంతుడు... సాయికుమార్‌. పదమూడేళ్ల వయసుకే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ఆరంభించి బాలనటుడిగా ప్రేక్షకుల అభిమానం పొంది హీరో అయిన సాయికుమార్‌ . తెలుగు ,కన్నడ , తమిళ బాషలలో మంచి ప్రావీణ్యము ఉన్నది . నటుడు సుమన్‌ కి , నటుడు రాజశేఖర్ కి ఎక్కువగా డబ్బింగ్ చెప్పేవాడు . పుట్టి పెరిగిందంతా మద్రాసులోనే అయినా ఈయన తాత తండ్రులది శ్రీకాకుళం జిల్లా.
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : సాయికుమార్ ,
 • పుట్తిన ఊరు : చెన్నై ,
 • పుట్టిన తేదీ : 27 జూలై 1960,
 • నాన్న : పి.జె.శర్మ - రైల్వే ఉద్యోగి ... విజయనగరం లో ఉద్యోగము .. నాటకాలు వేసే వారు ,
 • అమ్మ : కృష్నజ్యోతి ... కర్ణాటకలో బాగేపల్లి అనే ఊరు ... ప్రేమ వివాహము .
 • చదువు : బి.ఎ (పబ్లిక్ రిలేషన్‌), ఎం.ఎ.ఎం.ఫిల్(పబ్లిక్ అడ్మినంస్ట్రేషన్‌)-కొన్నాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెషర్ గా పనిచేసారు .,
 • తోబుట్తువులు : ఇద్దరు చెల్లెల్లు -కమల , ప్రియ , ఇద్దరు తమ్ముళ్ళు -రవి శంకర్(నటుడు /డబ్బింగ్ ఆర్టిస్ట్),అయ్యప్ప .
 • భార్య : సురేఖ (మేనమామ కూతురు )
 • పిల్లలు : అబ్బాయి -ఆది , అమ్మాయి -జ్యోతిర్మయి (మెడికో).
 • తొలి డబ్బింగ్ చెప్పిన సినిమా: సంసారం ,
 • బాల నటుడుగా తొలి సినిమా: దేవుడు చేసిన పెళ్ళి -గుడ్డివాడి పాత్ర ,
 • అభిమాన నటుడు : శివాజీ గణేశన్‌,
నటించిన సినిమాలు (filmography ): బాల నటుడుగా
 • దేవుడు చేసిన పెళ్ళి ,
 • జేబుదొంగ.
 • బొమ్మలాట ,
నటించిన కొన్ని సినిమాలు :
 • మనిషి రోడ్డున పడ్డాడు ,
 • పెద్దన్నయ్య ,
 • స్నేహం (బాపు గారి ),
 • చాలెంజ్ (వార్డ్ బాయ్ గా),
 • కలికాలము ,
 • పోలీస్ స్టోరీ ,
 • సామాన్యుడు ,
 • ప్రస్థానం -(2010),
 • అగ్ని IPS-(1996)
 • కాఖీ చొక్కా ,
 • నరహరి ,
 • ఓం నమ: శివాయ ,
 • భవవాన్‌ ,
 • ఎ.కె.47 ,
 • లా & ఆర్డర్ ,
డబ్బింగ్ చెప్పిన కొన్ని సినిమాలు :
 • తరంగిణి (సుమన్‌ కి ),
 • పండంటి కాపురానికి పనెండు సూత్రాలు (సుమన్‌),
 • వందేమాతతం (రాజశేఖర్ కి ),
 • తలంబ్రాలు , ,
 • అంకుశం , ,
 • ఆహుతి , ,
 • మగాడు ,,
 • ఇంకా ఎన్నో..........................
అవార్డులు :
 • 2005 లో నేషనల్ ఫిలం అవార్డ్ బెస్త్ చైల్డ్ ఆర్టిస్ట్ ... బొమ్మలాట సినిమాకి ,
 • 2006 లో ఫిలం ఫేర్ బెస్ట్ సఫోటింగ్ యాక్టర్ అవార్డ్ తెలుగు సామాన్యుడు సినిమాకి ,
 • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

 1. "ఈయన తాత తండ్రులది శ్రీకాకుళం జిల్లా".... ila miru rayadam chusi naku chala saradaga vundi andi... seshagiri rao garu....

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog