సనా ఖాన్ , Sana Khan

  •  
పరిచయం (Introduction) :
  • ముంబయ్ భామలను ఒక విధంగా ముందుగా గుర్తించి, ఆదుకునేది సౌత్ సినిమానే. టాలీవుడ్ కానీ, కోలీవుడ్ కానీ ముందుగా వీళ్ళని వెండితెర కెక్కిస్తుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ అదృష్టం. ఇలా ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద స్టార్లయిన అమ్మాయిలు చాలా మందే వున్నారు. ఇప్పుడలా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో ముంబయ్ ముద్దుగుమ్మ సనా ఖాన్. ఇటీవల వచ్చిన కల్యాణ్ రామ్ చిత్రం 'కత్తి' ద్వారా తను తెలుగు తెరకు పరిచయమైంది.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సనా ఖాన్‌ ,
  • పుట్తిన ఊరు : ముంబై ,
  • పుట్టిన తేదీ : 30 సెప్టెంబర్ 1981 ,
  • చదువు : ప్లస్ టు .
  • తండ్రి : మలయాళీ ముస్లిం - కేరళ లో కన్నూర్ ప్రాంతము ,
  • తల్లి : సఈదా - మంబై నుండి .
  • ఇస్టమైన తారలు : బాలీవుడ్ తారలు షారూఖ్, సల్మాన్ లన్నా, మాధురి, కాజోల్ లన్నా తనకి ఎంతో ఇష్టమట.
కెరీర్ :
  • సనా పుట్టింది, పెరిగింది ముంబయ్ లోనే. తను ప్లస్ టూ చదువుతుండగానే మోడెలింగ్ చేసే అవకాశం వచ్చింది. అలా ఒకటీ అరా కాదు, ఏకంగా 70 యాడ్ ఫిలిమ్స్ లో నటించింది. విశేషమేమిటంటే, షారూఖ్, అక్షయ్ లాంటి స్టార్స్ తో కూడా చేసింది. అలా చేస్తున్నప్పుడే తమిళంలో ఛాన్స్ వచ్చింది. హీరో శింబు తో 'శిలం బట్టం' చిత్రంలో తొలిసారిగా యాక్ట్ చేసింది. అన్నట్టు, ఆ తొలి చిత్రానికే అక్కడ ఓ అవార్డు కూడా కొట్టేసింది. ఆ తర్వాత 'కత్తి' లో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
  • తన మాటల్లో : "నేను చేసిన యాడ్స్ చూసి కల్యాణ్ రామ్ నన్ను పిలిచారు. తెలుగులో యన్టీఆర్ బ్యానర్ ద్వారా పరిచయం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సినిమా షూటింగులో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. కల్యాణ్ రామ్ చాలా మంచి మనిషి. చాలా సింపుల్గా వుంటారు. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది" అంటోంది సనా. ఇప్పుడు తను నాగ్ తో 'గగనం' సినిమాలో కూడా యాక్ట్ చేసింది. ఇది కూడా తనకు మంచి హెల్ప్ అవుతుందని ఆశిస్తోంది.
నటించిన సినిమాలు (filmography ):
  • కల్యాణ్ రామ్ చిత్రం 'కత్తి' -- తెలుగు -2010,
  • నాగ్ తో 'గగనం' సినిమా తెలుగు-2010 ,
  • వారసుడొచ్చాడు ... తెలుగు 2010 ,
  • మావాడు ... తెలుగు 2009 ,
తమిళము :
  • 2011 - Aayiram Vilakku ( Tamil )
  • 2010 - Thambikku Intha Ooru ( Tamil )
  • 2008 - Silambattam ( Tamil )
  • =========================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. sir seshgirirao garu sana khan ante eeme kadhu sir http://www.thehindu.com/arts/cinema/article108752.ece actual miru pettina photo madalasa sharma aney heroine....
    my blog http://telugutelevisionmedia.blogspot.com/

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala