Raghava K , రాఘవ కె .

పరిచయం (Introduction) :
  • కె.రాఘవకు రఘుపతి వెంకయ్య అవార్డు--2010
  • తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 'తాతామనవడు' వంటి గొప్ప సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత కె.రాఘవను ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.1940లో గేట్‌ కీపర్‌గా జీవితం ప్రారంభించిన రాఘవకు చిత్ర పరిశ్రమలోని అన్ని శాఖలలో పనిచేసిన అనుభవం ఉంది.అక్కడే ఉంటూ నృత్యం, ఫైట్స్‌, నిర్మాణ విభాగాల్లో పనిచేశారు. వాసన్‌, శివాజీ గణేశన్‌లతో ఉంటూ వారి చిత్ర వ్యవహారాలు చూసుకొనేవారు. తదుపరి కాలంలో చిత్రాల నిర్మాణంలో భాగస్వామిగానూ ఉన్నారు. స్వయంగా ఓ చిత్ర నిర్మాణ సంస్థని ఏర్పాటు చేసుకొని తెలుగు, హిందీ, తమిళంలో సినిమాలు తీశారు. 'జగత్‌కిలాడీలు'తో సినీ జీవితం ప్రారంభించారు. దాసరినారాయణరావు, కోడిరామకృష్ణలను ఈయనే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను, సాంకేతిక నిపుణులను చిత్రసీమకు పరిచయం చేశారు. హైదరాబాద్‌లో డబ్బింగ్‌, రికార్డింగ్‌ థియేటర్‌ను ప్రారంభించారు. ఫిలీంనగర్‌ హౌసింగ్‌ కాలనీలో గృహప్రవేశం చేసిన తొలివ్యక్తి రాఘవ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...'అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. నాకిప్పుడు 98 సంవత్సరాలు. ఇన్నేళ్లకునా సేవలని గుర్తించారు. విశేషమేమంటే...రఘుపతి వెంకయ్య గారి ఆఫీస్‌లో బాయ్ గా పనిచేశాను. ఈనాడు ఆయన పేరుతో ఉన్న అవార్డును బహూకరించి సత్కరిస్తున్నదుకు ఆనందంగా ఉంది. అప్పటి ప్రొడక్షన్‌కి, ఇప్పటి ప్రొడక్షన్‌కి చాలాతేడా ఉంది' అన్నారు.
  • ప్రముఖ నిర్మాత, ప్రతాప్‌ ఆర్ట్స్‌ అధినేత కె.రాఘవకు రఘుపతివెంకయ్య పురస్కారం రావడం పట్ల ప్రముఖ నటుడు సుమన్‌ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్ల క్రితం తెలుగులో నటుడిగా నా కెరిర్‌ రాఘవ నిర్మించిన 'తరంగిణి' చిత్రం ద్వారా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిగింది. చెన్నై నుండి హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఇంట్లోనే ఉన్నాను. కె.రాఘవ క్రమశిక్షణ, అంకితభావం నాపై ప్రభావం చూపించాయి. నాకెరిర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అలాంటి నిర్మాతకి రఘుపతి పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : కె .రాఘవ ,
నిర్మాత గా కొన్ని సినిమాలు (filmography ):
  • జగత్‌కిలాడీలు,
  • తాతా మనవడు-1973,
  • అంకితం -1990 ,
  • యుగ కర్తలు -1987,
  • ఈ ప్రశ్నకు బదులేది -1986,
  • త్రివేణీ సంగమం -1983,
  • ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య -1982,
  • సంసారం సాగరం,
  • తూర్పుపడమర,
  • తరంగిణి-1982,
  • అంతు లేది వింత కథ -1979,
  • సూర్య చంద్రులు -1978,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala