మల్లాది రామకృష్ణశాస్ర్తి,Malladi RamaKrishnaSastry

పరిచయం (Introduction) : ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ... పానగల్ పార్కులో మహాబోధి మల్లాది--(17/6/1905-12/9/1965). కొంతకాలం ‘దేశాభిమాని’ పత్రికలో ఉపసంపాదకునిగా పనిచేసిన మల్లాది రామకృష్ణశాస్ర్తి బహుభాషా కోవిదులు. నలభయ్యో పడిలో మద్రాసులో అడుగుపెట్టిన మల్లాది పగలంతా పానగల్ పార్కులో కూర్చొని వర్ధమాన సినీకవులకు సలహాలు ఇచ్చేవారు. చిత్రరంగంలో 40ల దశకంలో అజ్ఞాత రచయితగా ఉన్న ఈయన ‘చిన్న కోడలు (1952)’తో ప్రత్యక్ష సినీజీవితాన్ని ప్రారంభించి, సుమారు 200 పాటలు రాశారు. సన్నజాజుల సౌకుమార్యం, సంపెంగల సౌరభం, మకరందం మాధుర్యం కలబోసిన ‘జాను తెనుగు’ ఆయన ప్రత్యేకత. రహస్యం, చిరంజీవులు, జయభేరి, కలిమిలేములు, అనురాగం మొదలగు చిత్రాల్లో ఆణిముత్యాల వంటి పాటలను రాశారు. జీవిత విశేషాలు (profile) :
  • పేరు : మల్లాది రామకృష్ణశాస్ర్తి(Malladi KrishnaSastry),
  • పుట్తిన ఊరు : చిట్తిగూడూరు - మచిలీపట్నం --కృ్ష్ణా జిల్లా,
  • పుట్తిన తేదీ : 16-June-1905 లో ,
  • చదువు : డిగ్రీ (మచిలీపట్నం లో ) తెలుగు M.A మద్రాస్ యూనివర్సిటీ ,
పాటలు రాసిన కొన్ని సినిమాలు (filmography ):
  • రాజ నందిని --1958(డైలాగ్ , స్టోరీ),
  • సువర్ణ సుందరి -- 1957 (డైలాగ్ ),
  • చిరంజీవులు -- 1956 ,
  • దొంగల్లో దొర --1957,
  • శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ -1976,
  • వీరాంజనేయ --1968,
  • రహస్యం --1967,
  • శ్రీ వెంకటేశ్వర మహత్యం --1960,
  • జయభేరి --1959,
ప్లేబ్యాక్ సింగర్ గా :
  • దొంగరాముడు -- 1955 ,
  • పలనాటి యుద్ధం --1945 .
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala