Friday, December 3, 2010

బెంగుళూరు పద్మ,Bangalore Padma

పరిచయం (Introduction) :
 • సినిమాలు, సీరియళ్లు, స్టేజిప్లేలతో ఆంధ్ర ప్రేక్షకులందరికి సుపరిచితమైన నటి బెంగుళూరు పద్మ. సహాయ నటిగా, నృత్యకారిణిగా, స్టేజి ఆర్టిస్టుగా.. బహుముఖ ప్రజ్ఙావంతురాలామె. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివి, ఉన్నత విద్యావంతురాలైనా... తన అభిరుచి మేరకు చిత్రరంగం, బుల్లితెరనే ఆశ్రయించారు. ప్రస్తుతం నటన సహా మూవీ ఆర్టిస్ట్‌‌స అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : బెంగులూర్ పద్మ ,
 • పుట్టిన ఊరు : విజయవాడ ,
 • పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
 • చదువు : ఎం.ఎ (హిస్టరీ) ,
 • నాన్న : అప్పలస్వామి -రైల్వే ఉద్యోగి ,
 • అమ్మ : సుశీలా రాణి ,
 • భర్త : అరుణ్ కుమార్ - రచయిత ,
 • పిల్లలు : 2 అబ్బాయిలు - శ్రీనివాస్ ప్రసాద్(నటుడు) ,గాయత్రీ రావు ,
కెరీర్ : తన మాటల్లో
 • సినీరంగంలోకి బాలనటిగా నా నాలుగవ ఏటనే ప్రవేశించాను. ‘ఆలుమగలు’ తొలి చిత్రం. ఆ సినిమాలో అల్లు రామాలింగయ్య పిల్లల్లో ఓ కూతురిగా నటించాను. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించారా చిత్రం లో. తర్వాత ‘బొమ్మరిల్లు’ అనే చిత్రంలో బాల నటిగా నటించాను. సహాయ నటిగా చిరంజీవి ‘స్టూవర్ట్‌పురం పోలీస్‌ స్టేషన్‌’ చిత్రంతో ప్రారం భమై 150పైగా చిత్రాల్లో నటించాను. స్టూవర్ట్‌ పురం...లో చరణ్‌రాజ్‌కి కోయాక్టర్‌గా చేశా ను. తెలుగు చలనచిత్ర దర్శ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు సాగర్‌ ఆ సినిమాకి దర్శకత్వం వహించారు.
 • బెంగుళూరు పద్మ’ అని ఎందుకన్నారు? మీ పేరు ముందు బెంగుళూరు కథ ఏంటని అందరూ అడుగుతుంటారు. నిజానికి హైదరా బాద్‌ విజయనగర్‌ కాలనీలోనే పెరిగాను. వివా హం తర్వాత బెంగుళూరుకు వెళ్లాను. పరిశ్ర మలో నటన వృత్తిగా... అక్కణ్ణుంచి ఇక్కడికి తిరుగుతుండేదాన్ని. డాడి.రామానాయడు, రామోజీరావు, సుమన్‌... ఇలా ఎందరో శ్రే యోభిలాషులు. నేనెక్కడ ఉన్నా హైదరాబాద్‌కి పిలిపించి ఎన్నో పాత్రలు ఇచ్చి ప్రోత్సహించా రంతా. ఆ క్రమంలో బెంగుళూరునుంచి వచ్చి పోయే పద్మ అనేవారంతా. అది క్రమంగా బెం గుళూరు పద్మగా స్థిరపడి పోయింది. ద గ్గరివాళ్లు కూడా పద్మ అంటే గుర్తుపట్ట లే నంతగా పాకిపోయిందా పేరు. ఏదేమైనా బెంగుళూరు అనేది ఓప్రత్యేక గుర్తింపు.
నటించిన సినిమాలు (filmography ): సీరియల్స్ :
 • దేవత ... జెమినీ -టి.వి,
 • అభిషేకం ... ఈ టివి ,
కొన్ని సినిమాలు :
 • హాపి డేస్ -Happy Days (2007) Supporting Cast
 • మధుమాసం -Madhumasam (2007) Supporting Cast
 • మాయాబజార్ -Mayabazar (2006) Supporting Cast
 • మిస్సమ్మ -Missamma (2003) Supporting Cast
 • దొంగరాముడు -Donga Ramudu & Party (2003) Supporting Cast
 • ఆది -Aadi (2002) Supporting Cast
 • ప్రేమించుకుందాం రా-Preminchukundam Raa (1997) Supporting Cast
 • కూలీ నెం.1-Coolie No 1 (1991) Supporting Cast
 • ఆలు మగలు -Aalu Magalu (1977) Supporting Cast
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog