Swarnalatha(Malayali)-స్వర్ణలత(మళయాలి గాయని)

పరిచయం (Introduction) :
  • దక్షిణాది గాయని స్వర్ణలత -సెప్టెంబరు 12-2010 న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసింది. స్వర్ణలత వయస్సు 37. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ ప్రాంతానికి చెందిన స్వర్ణలత, 1982 వ సంవత్సరంలో “నీతికు తాండానై” అనే ఒక తమిళ సినిమాలో తొలిసారి తన గళం వినిపించింది. స్వర మాంత్రికుడు ఇళయరాజా ఆ చిత్రానికి సంగీత దర్శకుడు. సుమారు 7000 (ఏడు వేలు) పాటలు అన్ని భాషలలో పాడేరు . తెలుగు , తమిళం , క్న్నడం , మలయాళం , ఉర్దు , హిందీ భాలలలో పాడ గలిగేరు .
తెలుగులో కూడా స్వర్ణలత కొన్ని మంచి పాటలు పాడింది. ఉదాహరణకు, రామ్మా చిలకమ్మా…(చూడాలని ఉంది), చిన్ని తండ్రీ….(సిసింద్రీ), ఇంటికెళదాం పదవమ్మో….(ఆవిడా మా ఆవిడే), నా సిగ్గు తాంబూలాలు….(టైమ్), కుచ్చి కుచ్చి కూనమ్మా(బొంబాయి), గజ్జె ఘల్లుమన్నాదిరొ…(ఖుషీ), నచ్చావే పాల పిట్ట…( కలిసుందాం రా), మనసా..మనసా(అదృష్టం), తొంగి తొంగి చూడమాకు చందమామ(యజ్ఞం), రోజావే చిన్ని రోజావే…(సూర్యవంశం), నైజాం బాబులు…(ప్రేమంటే ఇదేరా), మాయమశ్చీంద్రా…, అదిరేటి డ్రెస్సు...(భారతీయుడు) లాంటి పాటలు ఆమె గాత్ర మాధుర్యానికి మచ్చుతునకలు.
  • స్వర్ణలత ఎక్కువశాతం ఇళయరాజా, రెహమాన్ స్వర సారధ్యంలోనే పాటలు పాడేది. తెలుగులో సుమారు 200 లకు పైగా పాటలు పాడింది. “పొరలే పొన్నుతాయి” అనే పాటకు గాను 1996 వ సంవత్సరంలో స్వర్ణలత జాతీయ ఉత్తమ గాయని అవార్డుని కూడా పొందింది. మరెన్నో అద్భుతమయిన పాటలు పాడి ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాల్సిన స్వర్ణలత, ఇంత చిన్న వయసులోనే మృత్యువాత పడటం సంగీత ప్రియులను కలచి వేసింది.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : స్వర్ణలత గాయని ,
  • పుట్టిన తేదీ : *-* 1973 ,
  • పుట్తిన ఊరు : అథిక్కొడు , చిత్తూర్ జిల్లా - పాలక్కడ్ ఏరియా (కేరళ), తరువాత చదువుకోసం ' షిమోగా' సిప్ట్ అయ్యారు . . . చివరిగా చెన్నై లో స్థిరపడ్డారు .
  • మరణము : 12-సెప్టెంబర్ 2010 . చె న్నయ్ లో ,
పాటలు పాడిన తెలుగు సినిమాలు (filmography ):
  • రామ్మా చిలకమ్మా…(చూడాలని ఉంది),
  • చిన్ని తండ్రీ….(సిసింద్రీ),
  • ఇంటికెళదాం పదవమ్మో….(ఆవిడా మా ఆవిడే),
  • నా సిగ్గు తాంబూలాలు….(టైమ్),
  • కుచ్చి కుచ్చి కూనమ్మా(బొంబాయి),
  • గజ్జె ఘల్లుమన్నాదిరొ…(ఖుషీ),
  • నచ్చావే పాల పిట్ట…( కలిసుందాం రా),
  • మనసా..మనసా(అదృష్టం),
  • తొంగి తొంగి చూడమాకు చందమామ(యజ్ఞం),
  • రోజావే చిన్ని రోజావే…(సూర్యవంశం),
  • నైజాం బాబులు…(ప్రేమంటే ఇదేరా),
  • మాయమశ్చీంద్రా…, అదిరేటి డ్రెస్సు...(భారతీయుడు)
  • ================================= 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala