Vaddepalli Krishna(cine Writer) .వడ్డేపల్లి కృష్ణ డా(రచియిత)

పరిచయం (Introduction) :
  • సినిమా పెళ్లిపాటల్లో 'ముద్దుల జానకి పెళ్లికి...' గీతానికో గుర్తింపు ఉంది. దీన్ని డా|| వడ్డేపల్లి కృష్ణ రాశారు. ఆయన కెరీర్‌కి ఈ పాట టర్నింగ్‌పాయింట్‌
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : కృష్ణ వడ్డేపల్లి -డా.
  • ఊరు : హైదరాబాద్ ,
కెరీర్ :
  • ఆయన మాటలలోనే -> తొలిసారి సినిమా పాట రాసింది 1979లో. ప్రముఖ సంగీత దర్శకులు టి.చలపతిరావుగారు నా రచనలు చూసి ఓ చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ, ఆ తొలిగీతం ట్రాక్‌ వాయిస్‌కి మాత్రమే పరిమితమైంది. అయినా నిరాశచెందకుండా ప్రయత్నాలు చేశాను. అలా ఓసారి భానుమతీ రామకృష్ణ దంపతులను కలిశాను. వాళ్లు నా రచనలు చూసి ఎంతో ముచ్చటపడ్డారు. 'రచయిత్రి'లో ఓ పాట రాయించారు. తరవాత అక్కినేని నాగేశ్వరరావు గారు నన్నెంతగానో ప్రోత్సహించారు. ఆపై సింగీతం శ్రీనివాసరావుగారి 'పిల్ల జమిందారు' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని 'నీ చూపులోని విరజాజివాన' పాట అప్పట్లో సూపర్‌హిట్‌. దాంతో రచయితగా బాగానే గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అడపాదడపా మాత్రమే వస్తుండేవి. పాటల్ని నమ్ముకుని హైదరాబాద్‌ వదిలి మద్రాస్‌ వెళ్దామన్న ఆలోచన ఉండేది. కానీ, ఉద్యోగాన్ని వదులుకుని గాల్లోదీపంలా బతకడం నాకిష్టం లేదు. దాంతో గీతరచయితగా నా తొలి ఇన్నింగ్స్‌ ముగిసిందనే చెప్పాలి.
కొత్త ఆశ
  • 1992... రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభం. రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు నాకు మంచి మిత్రులు. ఆయన ద్వారా ఎ.ఎం.రత్నం పరిచయమయ్యారు. అప్పుడాయన 'పెద్దరికం' సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందులో పెళ్లిపాట కోసం రాజ్‌కోటి ఒక ట్యూన్‌ని సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఆ విషయం తెలిసి నాకో అవకాశం ఇస్తే పాటరాస్తా అన్నాను. 'రాయండి. కానీ, ఒకవేళ నచ్చకపోతే ఆ విషయాన్ని సూటిగా చెప్పేస్తా. బాధపడకూడదు' అన్నారు రత్నం. సరే అని ఆ ట్యూన్‌ విన్నాను. పెళ్లివేడుకకు సిద్ధమౌతున్న ఓ అమ్మాయి గురించి ఆ క్షణం ఆమె మదిలో కలిగే భావాల గురించి రాయాలి. ట్యూన్‌ వినగానే చాలా నచ్చింది. సందర్భం ఇంకా బాగుంది. అన్నిటికీ మించి దాదాపు పదేళ్ల విరామం తరువాత రాయడానికి ఒక మంచి పాట దొరికిందన్న ఆనందం. ఎంతో పట్టుదలతో తపనతో పాట రాయడం మొదలుపెట్టాను.
పాటలు వ్రాసిన కొన్ని సినిమాలు (filmography )::
  • పెద్దరికం' చిత్రంలోని 'ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే' అన్న గీతం.
  • పిల్ల జమిందారు' చిత్రంలో 'నీ చూపులోని విరజాజివాన'
  • పెద్దరికం --ముద్దులజానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే,ఆశల రెక్కల హంసలు పల్లకి వోసుకు పోవలెనే
  • 'రచయిత్రి,
  • భైరవద్వీపం,
  • పోలీసు కర్తవ్యం,
  • గూఢచారి నెం.1,
  • అమృత కలశం...
మూలము : ఈనాడు ఆదివారము ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala