Friday, October 15, 2010

Raju T.V , టి.వి.రాజు

పరిచయం (Introduction) :
 • టి.వి. రాజు మ్యూజిక్ కంపోజర్ , సంగీత దర్శకుడు , యాక్టర్ . ప్రశాంతంగా ప్రవహిస్తున్న సెలయేటి మీద, చిరు పడవ పిల్ల గాలితోపాటు కదిలి వెళ్తూవుంటే ఎంత మనోల్లాసంగా ఉంటుందో, అలా ఉంటుంది టి.వి.రాజు గారి సరళ సంగీతం.
  • రాజుగారి తండ్రిగారు సోమరాజుగారు సంగీతజ్ఞులు కాదుగాని సంగీత ప్రియులు. రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం వారి స్వస్థలం. రాజుగారు పుట్టిన కొద్దికాలానికే తండ్రిగారు పోవడంతో, ఆయన్ని అదుపాజ్ఞల్లో పెట్టగలిగే వ్యక్తిలేక, జీవితం దారం తెగిన గాలిపటం అయిపోయింది. చదువు సాగలేదు. నాలుగోఫారం మెట్టు ఎక్కడమే గగనమైపోయింది. కాని, సంగీతం అంటే అభిమానం, ప్రేమా ఉండడం చేత స్వగ్రామంలో ఉన్న నల్లాన్‌ చక్రవర్తుల కృష్ణమాచార్యుల దగ్గర మూడేళ్లు స్వరాభ్యాసం చేశారు. ఒక పక్క అభ్యాసం చేస్తూనే పిల్లలకి పాఠాలు కూడా చెప్పేవారు. వాళ్లకి సంగీత పాఠాలు నేర్పుతూనే తాను 'జీవిత పాఠాలు' నేర్చుకున్నారు. అలా నాలుగేళ్లు గడిచింది. పాట, పద్యం బాగా పాడగలుగుతున్నాడని ఆ అబ్బాయి చేత నాటకాల వాళ్లు వేషాలు వేయించారు. 1934లో లోహితాస్యుడు వేషంతో రంగస్థలానుభవం ఆరంభమైంది. నిదానంగా కనకసేనుడు, నారదుడు, కృష్ణుడు వంటి పాత్రలు ధరిస్తూ వన్స్‌మోర్‌లు తెచ్చుకుంటూ రాణించసాగారు. అప్పుడు అతను మాస్టర్‌ వెంకటరాజు. ఆ చిన్న రాజుకి ఏదైనా వాద్యం నేర్చుకోవాలన్న కోరిక కూడా ఉండేది. ఆ కోరికతో నెమ్మదిగా హార్మోనియమ్‌ వాయించడం నేర్చుకున్నాడు. కొన్నాళ్లకి అందులో కొంత పూర్ణత వచ్చింది; స్వరాలు, రాగాలూ తెలిశాయి. ఆ ప్రతిభ సురభివారి నాటక సంస్థకి హార్మోనియమ్‌ వాయించడం వరకూ తెచ్చింది అతన్ని.
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : రాజు టి.వి . (వెంకటరాజు . టి.),
 • ఊరు : రఘుదేవపురం--రాజమండ్రి దగ్గర ,
 • పుట్టిన తేది : *-*-1921 ,
 • తోబుట్టువులు : అన్నయ్య -సత్యనారాయణరాజు ,
 • పిల్లలు : పెద్దరాజు , సోమరాజు - ఇద్దరు కొడుకులు సంగీతం నేర్చుకున్నారు .
 • మరణము : 20-ఫిబ్రవరి - 1973,
సినిమాలు (filmography ): కంపోజర్ :
 • 1. ధనమ ? దైవమా ? (1973)
 • 2. చిన్ననాటి స్నేహితులు (1971)
 • 3. మారిన మనిషి (1970)
 • 4. తలల పెల్లమ్మ (1970)
 • 5. నిండు హ్రిదయాలు (1969)
 • 6. సప్తస్వరులు (1969)
 • 7. విచిత్ర కుటుంబం (1969)
 • 8. బాగ్దాద్ గజదొంగ (1968)
 • 9. కలిసొచ్చిన అదృష్టం (1968)
 • 10. వరకట్నం (1968)
 • 11. బమ విజం (1967)
 • 12. భామ విజయం (1967)
 • 13. చదరంగం (1967)
 • 14. కంబోజరాజు కథ (1967)
 • 15. శ్రీ కృష్ణావతారం (1967/I)
 • 16. ఉమ్మడి కుటుంబం (1967)
 • 17. శ్రీ కృష్ణ పాండవీయం (1966)
 • 18. సవతి కొడుకు (1963)
 • 19. టాక్సీ రాముడు (1961)
 • 20. బలంగమ్మ (1959/I)
 • 21. రాజ నందిని (1958)
 • 22. శ్రీ కృష్ణ మాయ (1958)
 • 23. పాండురంగ మహత్యం (1957)
 • 24. చింతామణి (1956)
 • 25. జయసింహ (1955)
 • 26. తోడూ దొంగలు (1954)
 • 27. నిరుపేదలు (1954)
 • 28. పిత్చి పుల్లయ్య (1953)
 • 29. టింగు రంగ (1952)
మ్యూజిక్ డిపార్టుమెంటు :
 • 1. భామ విజయం (1967) (musical director)
యాక్టర్ :
 • 1. పల్లెటూరి పిల్ల (1950) ....
 • ౨. గూధచారి
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog