గజల్ శ్రీనివాస్ , Gazal Srinivas

పరిచయం (Introduction) :
  • ప్రముఖ కళాకారుడు గజల్ శ్రీనివాస్‌ను గిన్నిస్ రికార్డు వరించింది.గజల్ శ్రీనివాస్ అంటే తెలుగు కళాప్రియులకి సుపరిచితం అయిన పేరే! తెలుగులో గజల్స్ ని బాగా పాపులర్ చేసిన కళాకారుడు. ఆయన గజల్స్ చెప్పే విధానం కూడ చాలా బాగుంటుంది.మధ్య మధ్య లో చిన్న చిన్న సొంత వ్యాఖ్యానాలు జతచేస్తూ చెప్తూంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఆయన గజల్స్! ఆయన చెప్పే విధానం ఒకే ఫ్లో లో భలే ఉంటుంది.
  • గాంధీజీ తత్త్వంపై ఏకంగా 100 భాషల్లో పాటలు పాడిన శ్రీనివాస్ ప్రతిభను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ మేరకు గురువారం శ్రీనివాస్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఓ సందేశం పంపింది.జాతిపిత మహాత్మా గాంధీకి వినూత్న రీతిలో నివాళులర్పించే దిశగా గజల్ శ్రీనివాస్ ఓ పాటను వంద భాషల్లో ఆలపించే సాహసకృత్యానికి విజయవాడ వేదికైంది. బాపూజీ సిద్ధాంతాలపై తెలుగు, ఆంగ్లంతో పాటు మొత్తం 56 భారతీయ భాషల్లోనూ, 44 విదేశీ భాషల్లోనూ అదే గేయాన్ని, అదే స్వరంతో గానం చేసే యజ్ఞాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం రికార్డు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కు కూడా పంపారు.
  • సుమారు ఐదు నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం తీవ్రంగా కృషి చేసిన గజల్ ఒక్కొక్క భాషలో ప్రముఖులైన గేయ రచయితల చేత ఈ గేయాన్ని రాయించుకుని ఆ భాషకు గల సహజత్వం కోల్పోకుండా, అర్థం మారకుండా, అన్నింటిని ఒకే స్వరంలో పాడిన ఘనత శ్రీనివాస్‌ది.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : కేశిరాజు శ్రీనివాస్ - గజల్ సింగర్ ,
  • ఊరు : పాలకొల్లు -పశ్చిమ గోదావరి జిల్లా ,
  • చదువు : బి.ఎ . పొలిటికల్ - అంధ్రయూనివర్సిటీ ,లైబ్రరేరియన్‌ -మద్రాస్ యూనివర్సిటి .
  • ఉద్యోగము : స్కూల్లో లైబ్రేరియన్ ఒకప్పుడు,
కుటుంబము :
  • తండ్రి : నరసింహారావు ,
  • తల్లి : రత్నావళి ,
  • భార్య ; సురేఖ ,
  • పిల్లలు : ఒక్క కూతురే - సంస్కృతి ,
నటించిన సినిమాలు (filmography ):
  • ఎన్నో పురష్కారాలు , అవార్డులు వచ్చాయి .
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala