అమ్మ తో నటీ నటులు , Celebrities with Moms

పరిచయమ : అమ్మ ప్రేమ
  • సృష్టిలో విలువ కట్టలేని ప్రేమ అమ్మ ప్రేమ
  • సృష్టిలో పొందే కమనీయమయిన ప్రేమ అమ్మ ప్రేమ
  • సృష్టిలో పొందే మధురమయిన ప్రేమ అమ్మ ప్రేమ
  • పొందేకొద్దీ తరగని ప్రేమ అమ్మ ప్రేమ
  • పంచేకొద్దీ పెరిగే ప్రేమ అమ్మ ప్రేమ
  • కను రెప్పకన్నా మిన్నగ చూసుకునే ప్రేమ అమ్మ ప్రేమ
  • నేను పలికిన మొదటి పలుకు అమ్మ
  • నేను చుసిన మొదటి రూపము అమ్మ
  • నేను విన్న మొదటి మాట అమ్మ
  • ఆకలి గమనించి కడుపు నింపే ప్రేమ అమ్మ
///డా.శేషగిరిరావు - శ్రీకాకుళం ///
  • ---------------------------------------------------
అమ్మ గురించి తారలు చెప్పిన కబుర్లు. ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం' అని ఒకరంటే 'నా అందం వెనుక రహస్యం మా అమ్మే' అంటారు మరొకరు. 'అమ్మ పక్కన లేనిదే అడుగు కూడా బయట పెట్టను' అని ఇంకొకరంటారు. అలా అని వీళ్లేం సాధారణ మహిళలు కాదు. అందం అభినయంతో గ్లామర్‌ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈముద్దుగుమ్మలంతా తమ విజయం వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమ్మే ఉందంటున్నారు.
  • --------------------------------------------------
Zarine and Zayed Khan
  • --------------------------------------------------------
Vaishalitai and Riteish Deshmukh
  • ---------------------------------------------------
త్రిష బయట ఎంతమంది ఫ్రెండ్స్‌ ఉన్నా అమ్మే(ఉమా క్రిష్ణన్‌) నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నా సంతోషాన్నైనా, బాధనైనా తనతోనే పంచుకుంటా. మనసుకు కష్టం కలిగినపుడు అమ్మ పక్కనుంటే చాలు. ఓదారుస్తూ తను చెప్పే మాటలే నాకు కొండంత ధైర్యాన్నిచ్చే టానిక్‌. ఆడపిల్లలు ఆత్మ విశ్వాసంతో ఉంటే ఎంతో ఇష్టపడే అమ్మ నన్నూ అలానే పెంచింది. చిన్నప్పట్నుంచే నాకు వోడ్రన్‌ దుస్తులు వేసేది. పూర్తి స్వేచ్ఛ నిచ్చేది. తన వల్లే ఇప్పుడు నేను ఇంత పెద్ద హీరోయిన్‌ని కాగలిగాను.
  • --------------------------------------
Sushma and daughter Manisha
  • ----------------------------------------------------------
Suniel Shetty and his mom
  • --------------------------------------------------------
sridevi_daughter_jhanavi_kapoor
  • ---------------------------------------------------------------
స్నేహ నాకు ఇద్దరన్నయ్యలు, ఒక అక్క. నాన్న చాలా స్ట్రిక్ట్‌. అమ్మ మాత్రం బాగా క్లోజ్‌. ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందంటే అక్కా నేనూ అమ్మా కలిసి ఎక్కడికైనా బయటికెళ్లామనుకోండి, ఎవరైనా కాస్త అందంగా ఉన్న అబ్బాయిని చూపించి 'బావున్నాడా' అంటూ ఆటపట్టిస్తుంది. ఇక నటించడం వెుదలుపెట్టాక అన్నీ అమ్మే అయ్యింది. మా కుటుంబం అంతా దుబాయ్‌లో ఉంటుంది. అమ్మ మాత్రం నాతో ఉండి ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటుంది. అందుకే తన ప్రేమను ఇపుడు ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తున్నా. ఎంతైనా అమ్మ అమ్మే.
  • --------------------------------------------------
శ్రియ చిన్నప్పట్నుంచి నాకు సంగీతమన్నా, నృత్యమన్నా చాలా ఇష్టం. అది గమనించిన అమ్మా నాన్నా నాకోసం హరిద్వార్‌ నుంచి ఢిల్లీకి మకాం మార్చారు. అమ్మే నన్ను రోజూ డాన్స్‌ క్లాసులకు తీసుకెళ్లేది. సినిమాల్లోకి వచ్చాక తనకిష్టమైన టీచర్‌ ఉద్యోగాన్ని కూడా వదులుకుని నన్ను చూసుకుంటోంది. ఏది మంచో ఏది చెడో వివరించి నన్ను సరైన మార్గంలో నడిపించే అమ్మ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక అమ్మకూ నాకూ మధ్యనున్న అనుబంధం గురించి చెప్పాలంటే మాటలుచాలవు.
  • ---------------------------------------------
Shabana and her mother Shaukat Azmi
  • -------------------------------------------------------------------
Salma and Salman Khan
  • --------------------------------------------------------------
రేఖ నేను అందగత్తెనని అందరూ అంటారు. కానీ దానికోసం నేను ప్రత్యేకించి శ్రమించింది లేదు. బహుశా అది మా అమ్మ (నటి పుష్పవల్లి) నుంచే నాకొచ్చిందేవో. అవును, అమ్మ చాలా బాగుంటుంది. నిజ జీవితంలో కూడా ఆమే నాకు స్ఫూర్తి. చివరి రోజుల్లో అమ్మ నాకు ఎన్నో లేఖలు రాసింది అవే నాకు జీవిత పాఠాలు. వాటిని ఇప్పటికీ దాచుకున్నా. 'నీ పనేదో నువ్వు చూసుకో, ఎవరినుంచి ఏదీ ఆశించకు' అని అమ్మ చెప్పిన పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోను. అందుకే, ఈరోజు ఎవరి గురించి పట్టించుకోకుండా హాయిగా బతకగలుగుతున్నాను.
  • --------------------------------------------
Priyanka Chopra and her mom Madhu Akhauri
  • -------------------------------------------------------
ప్రియమణి అమ్మ లతామణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి. అంతర్జాతీయ స్థాయిలో ప్రకాశ్‌పడుకొనే లాంటి ఆటగాళ్లతో ఆడింది. తను వంట కూడా చాలా బాగా చేస్తుంది. అమ్మ చేసే రవ్వదోసెలంటే నాకెంత ఇష్టవో. నా అందం, ఆరోగ్యం విషయంలోనే కాదు, సినిమాల ఎంపికలో కూడా అమ్మ పాత్ర ఉంటుంది. ఇక సౌందర్య రహస్యం అంటారా... కష్టం అమ్మకు, ఫలితం నాకు. అవును మరి, షూటింగ్‌ లేకపోతే ఓ కప్పు పెరుగు, మీగడ, సెనగపిండి తీసుకుని ప్రత్యక్షమౌతుంది.
  • -----------------------------------------
NTR WITH HIS MOM SHALINI
  • ----------------------------------------------------------
Nagma and Seema Sadhana
  • -------------------------------------------------------------
Meena with her mother
  • ------------------------------------------------
Manjula vijaykumar with daughter Sridevi
  • ------------------------------------------------------------------------------
Mahima Chaudhry poses with her mother
  • ------------------------------------------------------------
Madhuri Dixit and mother Snehlata Dixit
  • ------------------------------------------------------------------------
Karisma and Babita Kapoor
  • ------------------------------------------------------------------------
కాజల్‌ అమ్మ వినయ్‌ అగర్వాల్‌. మామూలు సమయాల్లో నన్నెంత ప్రేమగా చూసుకుంటుందో ఏదైనా పొరపాటు చేస్తే అది తప్పని అంత కచ్చితంగా చెబుతుంది. నా సినిమా విడుదలవగానే థియేటర్‌కు వెళ్లి మరీ చూస్తుంది. అందులో నా నటన బాగుంటే మెచ్చుకుంటుంది. లేదంటే లోటు పాట్లను వివరించి ఎలా సరిదిద్దుకోవాలో సూచిస్తుంది. అవి నాకు చాలా సందర్భాల్లో ఉపయోగ పడ్డాయి. ఇక, నేనే నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు అమ్మ సలహా, సపోర్ట్‌ కావల్సిందే. అంతేకాదు, స్నేహితురాలిగా ఉంటూ నన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే, అమ్మంటే నాకు చాలా ఇష్టం.
  • -------------------------------------------------------
జెనీలియా నాన్న నీల్‌ అమ్మ జినెట్‌ పేర్లు కలిసేలా నాకు జెనీలియా అని పేరు పెట్టారు. ఇక అమ్మ గురించి చెప్పాలంటే తనకు నేనంటే చాలా ఇష్టం. అందుకే, నచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకుని నాతోనే ఉంటోంది. నేను చేయబోయే సినిమాల కథలు తనూ వింటుంది. కానీ అందులో నటించాలా వద్దా అన్న నిర్ణయాన్ని మాత్రం నాకే వదిలేస్తుంది. అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలనీ కాకపోతే అది హద్దులు దాటకూడదని చెబుతుంటుంది అమ్మ. అందుకే తన నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము చేయను.
  • -----------------------------------
Jaya and Abhishek Bachchan
  • -----------------------------------------------------------------------
ఐశ్వర్యారాయ్‌ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుక్కారణం అమ్మా, నాన్నే. పరిస్థితులకనుగుణంగా మసులుకోవడం అమ్మ వృందారాయ్‌ నుంచే నేర్చుకున్నా. నాన్న ఉద్యోగరీత్యా ఇంటి దగ్గర ఉండడం చాలా తక్కువ. దాంతో నేను చిన్నప్పుడు ఎక్కువగా అమ్మతోనే గడిపా. అమ్మ రచయిత్రి కూడా. నేను నటించిన 'దిల్‌ కా రిష్తా' సినిమాకు కథను రాసింది తనే.
  • ----------------------------------------------
ఇలియానా నటనంటే ఆసక్తి లేని నేను ఈరోజు నటిగా ఇంత గుర్తింపును పొందగలిగానంటే కారణం అమ్మ సమీర. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వెుదట్లో ఎంతో ఒత్తిడిగా, విసుగ్గా అనిపించేది. దాంతో వెుదటి సినిమాతోనే నటించడం మానేయాలనుకున్నా. అప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించింది అమ్మ. కష్టపడితేనే విజయం వరిస్తుందని ధైర్యం చెప్పింది. అనుకున్నట్లే దేవదాసు, పోకిరి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. షూటింగుల్లో ఎక్కడికెళ్లినా అమ్మ నావెంటే ఉండి వసతులు, బాగోగులూ అన్నీ దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాదు, సినిమాల్లో నా డ్రెస్సులను తనే స్వయంగా డిజైన్‌ చేస్తుంది. ఇన్నాళ్లూ గమనించలేదు కానీ, అమ్మలో చాలా సృజనాత్మకత ఉంది.
  • --------------------------------------------
హన్సిక ఎప్పుడూ నా వెంట ఉండేది ఎవరని అడిగితే ఆలోచించకుండా చెప్పే సమాధానం అమ్మ వోనా. తను నాకు ఏలోటూ లేకుండా పెంచింది. బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఈరోజు హీరోయిన్‌గా ఇంత పేరు తెచ్చుకున్నానంటే అది అమ్మ ప్రోత్సాహంతోనే. నా కెరీర్‌ను అంత బాగా ప్లాన్‌ చేసింది తను. అమ్మ నాకు ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, గైడ్‌ మాత్రమే కాదు, డాక్టర్‌, బ్యూటీషియన్‌, డ్రెస్‌డిజైనర్‌ అన్నీ. బాధకలిగినా ఆనందం కలిగినా అన్నీ అమ్మతోనే పంచుకుంటా. ఆమె సలహా లేనిదే ఏ పనీ చెయ్యను. నా జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా తనకే వదిలేస్తా.
  • ------------------------------------------------------
Fardeen's cousin Zayed Khan's mother Zarine is an interior decorator. She recently spoke about her son-in-law Hrithik Roshan (who is married to Zayed's sister Suzanne). Zayed's dad is Sanjay Khan. Zayed is the youngest of four children -- older sisters are Simone Khan (wife of Ajay Arora), Suzanne Roshan and Farah Khan Ali (wife of DJ Aqeel). We have seen Riteish Deshmukh's dad, Vilasrao Deshmukh, former Chief Minister of Maharashtra many times. Here is his mom, Vaishali. Eesha Koppikhar and her mother
  • ------------------------------------------------------------------------
ఛార్మి అందరూ నన్ను అందంగా ఉన్నానని పొగిడేస్తుంటారు. కానీ, నా అందం వెనుక రహస్యం మా అమ్మే. అవును, తను నాకన్నా చాలా బాగుంటుంది. అమ్మకు 19ఏళ్లున్నపుడు దిగిన ఫొటో ఎవరైనా చూస్తే నేనే అనుకుంటారు. అందుకే, నా అందం మా అమ్మ ఇచ్చిన వరం. ఇక నేను సినిమాల్లోకి రావడం యాదృచ్ఛికంగానే జరిగినా అమ్మ నన్నెంతగానో ప్రోత్సహించింది.
  • --------------------------------------------------
Bhoomika Chawla and her mother
  • ---------------------------------------------------------------
Ameesha, brother Asmit and mother Asha Patel
  • ----------------------------------------------------------------------
Akshay and his mom
  • -------------------------------------------------------------------------
A.R.Rehman & Mother-Kareema Begum,
  • -----------------------------------------------------------------------------
  • =================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. Dr.Seshagirirao-MBBS గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala