శృతి హాసన్ , Shruthi Hassan









పరిచయమ :
  • కమల హాసన్ , సారిక ల కుమార్తె శృతి హాసన్ . దర్శకుడు 'రాఘవేంద్రరావు ' కుమారుడు ప్రకాష్ రావు దర్సకత్వం వహిస్తున్న ఒక తెలుగు సినిమా లో నటుడు సింద్ధార్డ సరస నటించడం ద్వారా తెలుగు తెరకు పరిచయమ అవుతున్నారు . అమ్మ దూరమయ్యాక ముద్దుగా పెరిగిన ఈమె సంగీతం నేర్చుకున్నారు. ఈ మద్యన తమిళం లో " ఉన్నైపోల్ వోరువన్ " అనే సినిమాకు సంగీతం కంపోజ్ చేశారు . పాటలు పాడగలరు . " హేరాం , గాంధీ సినిమాలలో బాలనటిగా చేసారు .
. ప్రొఫైల్ :
  • పేరు : శృతి రాజలక్ష్మి హాసన్ ,
  • పుట్టిన తేది : 28 -జనవరి ,1986 ,
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • తండ్రి : కమల హాసన్ ,
  • తల్లి : సారిక,
  • తోబుట్టువులు : ఒక చెల్లి - అక్షర -ఇంకో చిట్టిచెల్లి సుబ్బలక్ష్మి(గౌతమి కూతురు),
  • చదువు : సైకాలజీ లో డిగ్రీ , అమెరికా లో సంగీతం లో ప్రావీణ్యత సంపాదించినది .
  • తొలి సినిమా : హే రామ్‌ (2000),
  • తొలి తెలుగు పాట : ఈనాడు సినిమా (2009),
  • * తొలి పారితోషికం: నా తొలి పారితోషికం నటిగా అందుకోలేదు. 'హే రామ్‌' లో అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా పని చేస్తూ రోజుకి రూ. 70 చొప్పున అందుకున్నాను. ఆతర్వాత 'లక్‌' ద్వారా హీరోయిన్‌గా అందుకున్నాను. అదెంత అంటే మాత్రం సీక్రెట్‌.
  • * తొలి పర్యటన: ఆరు నెలల వయసులోనే అమ్మా నాన్నతో కలసి జర్మనీ పర్యటనకు వెళ్లానంట. ఆ తర్వాత చాలా ప్రాంతాలు తిరిగాను. హీరోయిన్‌గా మాత్రం నా తొలి ప్రయాణం దక్షిణాఫ్రికాకి.
  • * తొలి వాహనం: నా తొలి వాహనం అంటే నాకు నా సైకిల్‌ గుర్తుకొస్తుంది. చిన్నతనంలో సైకిల్‌పై చక్కర్లు కొట్టేదాన్ని. అలా తిరగడం అంటే ఇప్పటికీ నాకెంతో సరదా. కానీ ఇప్పుడు కుదరదు. నా తొలి కారు టయోటా ఫార్ట్యూన్‌. ఆస్టోన్‌ మార్టిన్‌ మోడల్‌ కారు కొనాలనేది నా కోరిక.
  • * తొలి హిట్‌ - ఫ్లాప్‌: నా తొలి హిట్‌ గబ్బర్‌ సింగ్‌. ప్లాఫ్‌ లక్‌. కానీ జయాపజయాల్ని నేను ఎప్పుడూ పట్టించుకోను. రెండు సమయాల్లోనూ నేను ఇంకా బాగా చేయాలి. మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచనలే నా మదిలో మెదులుతాయి.
  • * తొలిసారి తెరపై చూసుకున్నప్పుడు: నన్ను నేను తొలిసారి తెరపై చూసినప్పుడు అక్కడ కనిపిస్తుంది నేను కాదు.. ఓ నటిమాత్రమే అనిపించింది. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. నాన్నని అలా చూస్తే మాత్రం చాలా గర్వంగా ఉంటుంది.
  • * తొలి సెల్‌: చాలా రోజుల నుంచి నేను సెల్‌వాడుతున్నాను. నోకియాలో 3310 మోడల్‌ వాడేదాన్ని. అది ఇప్పటికీ నాకు గుర్తే. నారింజ రంగులో ముద్దుగా ఉండేది.
  • * తొలి డ్యాన్స్‌: 'విచిత్ర సోదరులు'లో నాన్న చేసిన డ్యాన్స్‌లు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆ స్టెప్పులు ఆయన నేర్పించారు. అంటే అవే నేను వేసిన తొలి స్టెప్పులు.
  • * మీపై తీసిన తొలి షాట్‌: ఇక్కడ కూడా నాయికగా తొలి షాట్‌లో నటించలేదు. 'హేరామ్‌' సినిమాలోనే నాన్న వెనుక నేను అలా నడిచి వెళ్తుంటే తొలి సన్నివేశం చిత్రీకరించారు. అలా నాన్నతో తెరను కూడా పంచుకునే అవకాశం దక్కింది.
  • * తొలిసారి పాడిన పాట: 'పోట్రీ పాడాది పొన్నే..' అంటూ ఆరేళ్ల వయసులోనే ఇళయరాజా గారి స్వర దర్శకత్వంలో 'తేవార్‌ మాగన్‌ అనే తమిళ సినిమా కోసం పాడాను. ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యాక 'లక్‌'లో 'ఆజ్మా..' అనే పాట పాడాను.
  • * తొలి బహుమతి: నేను అందుకున్న తొలి బహుమతి ఏంటో సరిగ్గా గుర్తులేదు. అయితే నా 18వ జన్మదినం రోజు నాన్న మ్యూజికల్‌ కీబోర్డు, సంగీత పరికరాలు ఇచ్చారు. ఆ బహుమానం ఎప్పటికీ మరచిపోలేను.
  • * తొలి మెచ్చుకోలు: నటి అన్నాక మెచ్చుకోలు రావడం సహజం. నేనైతే ఆరేళ్ల వయసులోనే అందుకున్నాను. సింగపూర్‌లో నేను చేసిన ఓ ప్రదర్శన చూసి అక్కడివారందరూ మెచ్చుకున్నాను. అది నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది.
  • * తొలి అభిమాని: అభిమాని అంటే మన మంచిని మంచిగాను. చెడుని చెడుగానూ చెప్పేవారు. అలా అయితే నా తొలి అభిమాని మా నాన్నే. ఇంకా చెప్పాలంటే ఆయన అభిమాని కాదు. నా శ్రేయోభిలాషి. నా జీవితంలో హీరో మా నాన్నే.
  • * తొలి వదంతి: సినీతారలకు వదంతులు అలవాటే. నా విషయంలో మాత్రం నా స్కూలు రోజుల్లోనే మొదలయ్యాయి. అవేంటి అంటారా. ఇప్పుడెందుకులెండి. ఎప్పుడో జరిగిపోయినవాటి గురించి.
  • * తొలి విమర్శకులు: నా సినిమాలకు తొలి విమర్శకులు నేనే. అలా ఉంటేనే కదా ముందుకెళ్లగలం.
  • * ఆహారంలో తొలి ప్రాధాన్యం: సాంబారు అన్నానికే నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే ఇంకేదైనా.

ఫిల్మోగ్రఫీ : నేపధ్య గాయనిగా :
  • హే రామ్ -(2000) తమిళ్ ,
  • లక్ -(2009) హిందీ,
  • చాచి 420(1997) తమిళ్
నటిగా :
  • హే రామ్ -బాల నటిగా ,
  • గాంధీ -- బాల నటిగా,
  • ఉన్నైపోల్ ఒరువన్ (2009) తమిళ్ ,
  • యోధ - (2010) తెలుగు .
  • మ్యూజిక్ డైరెక్టర్ గా : ఈనాడు (2009), ఉన్నైపోల్ ఒరువన్ (2009)

  •  ==================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. "అమ్మ చనిపోయాక ముద్దుగా పెరిగిన ఈమె" - ఎవరి అమ్మ చనిపోయిందండీ?
    శృతి నటిగా హిందీ మూవీ Luck లో నటించిందికదా (Debut)?

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala