Sunday, January 24, 2010

మాళవిక , Malavika(singer)


పరిచయమ :
 • మాళవిక. స్వస్థలం విశాఖ. 'గంగోత్రి'లో పాట పాడాక మకాం హైదరాబాద్‌కి మారింది. బీకాం చదివిన ఆమె స్వర ప్రస్థానం గురించి ఏం చెబుతుందో చదవండి. ''అమ్మ సంగీత ఉపాధ్యాయురాలు. తనే నాకు తొలిగురువు. తరవాత రెండేళ్లు శిక్షణ తీసుకున్నా. ఏడో తరగతిలో ఉండగా ఈటీవీ 'పాడుతా తీయగా'లో మొదటి స్థానం. పాటలు పాడే అవకాశాలొచ్చాయి. అప్పుడే గంగోత్రిలో మొదటిసారి బాలూ గారితో కలిసి పాడాను..'' అని చెబుతుంది. అది మొదలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఆంగ్ల చిత్రాల్లో ఆమె స్వరం వినిపించింది. బిల్లా, ఏక్‌ నిరంజన్‌లలో ఆమె పాడిన పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మలు విదేశాల్లో నిర్వహించిన సంగీత విభావరుల్లోనూ పాల్గొని మంచి గాయనిగా గుర్తింపు సాధించింది.పదిహేనేళ్లకే గాయనిగా పరిచయమైన మాళవిక ఎన్నో పాటలు పాడింది. ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. 'రాజన్న'లో 'అమ్మా అవనీ...' పాటకు నంది అవార్డు గెలుచుకుంది.
ప్రొఫైల్ :
 • పేరు : మాలవి
 • పుట్టిన తేది : 06 జూలై.
 • పుట్టిన ఊరు : విశాఖపట్నం , 
 • నివాసము : హైదరాబాద్ , 
* నవ రాత్రుల సమయంలో పాటించే నియమాలు
 • ఎక్కువగా పండ్లు తింటా. ఉల్లిపాయ తినను. సరస్వతీ దేవిని తలుచుకుని వీణకు పూజ చేస్తా 
* దసరాతోపాటు బాగా జరుపుకొనే పండగలు
 • దీపావళి, ఉగాది వినాయక చవితి
* నచ్చిన పౌరాణిక చిత్రాలు
 • పాండవ వనవాసం, వీరాభిమన్యు, నర్తనశాల
* అభిమానించే గాయకులు
 • బాలూ గారు, లతామంగేష్కర్‌, జానకి
* మీరు పాడిన భక్తి పాటలు
 • సింహాలో 'కనులారా చూడరా..'. శ్రీరామదాసులో 'ఏటయిందె గోదారమ్మా'. శిరిడి సాయిలో 'రామ నవమి..'. 
* ఇష్టంగా వినే దేవుని పాటలు
 • భీష్మలోని 'మహాదేవ శంభో...'. జగదేక వీరుని కథలోని 'శివశంకరీ.. శివానంద లహరీ...'. శ్రీరామరాజ్యంలోని 'జగదానంద కారక...'.
* పూజించే దేవుళ్లు
 • సరస్వతీ దేవి. వినాయకుడు. అంజనేయ స్వామి
* తరచూ వెళ్లే పుణ్య క్షేత్రాలు
 • తిరుపతి, విజయవాడ, శ్రీశైలం
* నచ్చే దుస్తులు
 • చీరలు, చుడీదార్‌, కుర్తా
* పండగరోజు ఏం చేస్తారు?
 • గుడికి వెళతాను. బంధువుల్ని కలుస్తా. ఓ పౌరాణిక సినిమా చూస్తా
* మీ వారిలో నచ్చిన గుణాలు
 • కోపం ఉంది - నా మీద ప్రదర్శించరు. ఏ సబ్జెక్టు గురించైనా మాట్లాడగలరు. సంగీతాన్ని ఇష్టపడతారు 
* బలాలు
 • అమ్మానాన్నా, మా వారు కృష్ణ, నా గొంతు 
* బలహీనతలు
 • ఆత్మవిశ్వాసం లేకపోవడం, మొహమాటం, సున్నితంగా ఉండటం 
* మీ ఇంట్లో ఈ రోజు ప్రత్యేకత
 • పెళ్లయ్యాక మొదటి దసరా. కొత్త వంటలు ప్రయత్నిస్తున్నా. మా కోసం మేం సమయం కేటాయించుకుంటాం. 
* ఇష్టమైన పిండి వంటలు
 • పులిహోర, పెరుగు గారెలు, ఉండ్రాళ్లు

ఫిల్మోగ్రఫీ : కొన్ని పాటలు :
 • ౧. నువ్వు నేను కలిసుంటేనే గంగోత్రి
 • ౨. ఒక తోటలో గంగోత్రి
 • ౩. గోదారిలగా మనసుతో
 • ౪. గోదావరిలా చార్మినార్
 • ౫. హోలేస్సా శ్రీ రామదాసు
 • ౬. జోలలీ విక్రమార్కుడు
 • ౭. బొమ్మలి బిళ్ళ
 • ౮. అరెరే ఏమిది ఒంటరి
 • ౯. బుగ్గలలోన భూకంపం సౌర్యం
 • ౧౦. నీలాలు గారు ఎవరైనా ఎపుడైనా
 • ౧౧. మాతృదేవోభవ పాండురంగడు
 • ౧౨. ఏమని అడగను పాండురంగడు
 • ౧౩. చిటారు కొమ్మన మిచెల్ మదన కామరాజు
 • ౧౪. అందమైన ఆస ఉంది మాయగాడు
 • ౧౫. గాలైన ఒద్దులే రేచిపో
 • ౧౬. ఎవరు లేరని అనకు ఏక నిరంజన్

 • =========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

Your comment is necessary for improvement of this blog