Friday, September 11, 2009

కార్తీక , Karthika(actress) •  
పరిచయం :
 • నటి రాధ కూతురు ఈ కార్తీక ... జోష్ తెలుగు సినిమా లో నాగచైతన్య సరసన తొలిసారిగా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. .టాప్ హీరోయిన్ కూతురుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ సరైన హిట్ అందుకోవడంలో సక్సెస్ అందుకోలేకపోయిన పొడుగు కాళ్ళ సుందరి కార్తీక నటిగా తన టాలెంట్ నిరూపించుకునే సినిమా దొరికిందని చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం కార్తీక తమిళ్ లో బాగా ఫేమస్ అయిన భారతీ రాజా దర్శకత్వంలో ‘అన్నా కొడై’ సినిమాలో నటిస్తోంది.
ప్రొఫైల్ :
 • పేరు : కార్తీక ,
 • పూర్తిపేరు : కార్తీకా నాయర్‌,
 • పుట్టినరోజు : జూన్‌ 27
 • అమ్మ : రాధ నటి ,
 • నాన్న : రాజశేఖరన్‌ నాయర్ (హొటల్ యజమాని),
 • తోబుట్టువులు : చెల్లెలు - తులసి , తమ్ముడు - విఘ్నేష్ ,
 • పెద్దమ్మ : అంబిక - నటి ,పెద్దనాన్న - సుదీష్ ;
 • చదువు : +2 , బిజినెస్ కోర్సులో ఇంటర్నేషనల్ డిగ్రీ చదువుతోంది,
 • తెరంగేట్రం : 'జోష్‌'లో నాగచైతన్యతో కలసి నటిగా పరిచయమయ్యా,
 • రెసిడెన్స్ : ముంబై , నాన్న ముంబై వాసి .
 • తొలి డైలాగ్‌ : హీరోతో 'ఆహా.. అలా కాదమ్మా' అని ముద్దుగా చెప్పాలి. కాస్త భయపడుతూనే చెప్పారట,
  • ఖాళీగా ఉంటే : పబ్‌లకూ షికార్లకూ వెళ్లను. ఇంట్లోనే తోబుట్టువులతో గడుపుతారుట .
  • నచ్చే భోజనం : ఎక్కువగా దక్షిణాది వంటకాలే,
  • నచ్చే ఆభరణాలు : ఉంగరాలు, బ్రేస్‌లెట్స్‌, ప్లాటినం ఆభరణాలు
  • హాలీడే స్పాట్‌ : వాళ్ళ ఇల్లేనట ,
  • మెచ్చిన పుస్తకం : ద సీక్రెట్‌,
  • అభిమాన హీరోలు : రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, షారుఖ్‌, అమీర్‌ఖాన్‌,
  • హీరోయిన్లు : అమ్మ (రాధ), శోభన, సౌందర్య,
  • ఇష్టపడే దుస్తులు : జీన్స్‌ టీ షర్ట్స్‌, అప్పుడప్పుడూ చీరలు,
  • డ్రీమ్‌రోల్‌ : 'చంద్రముఖి'లో జ్యోతిక లాంటి పాత్రలో నటించాలి,
  • అమ్మ ప్రభావం : అమ్మ (రాధ) నాకు మంచిగైడ్‌. నేను ఎలాంటి పాత్రలు వేస్తే బాగుంటుందో ఆమెకే బాగా తెలుసు,
  • ఓ హాబీ : అప్పుడప్పుడూ పెయింటింగ్స్‌ వేస్తుంటాను. శిక్షణ కూడా తీసుకున్నారు . శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నారట . అన్ని రకాల నృత్యాల్లోనూ ప్రావీణ్యం సంపాదించాలన్నది నా కోరిక అంటారు.
  • హాస్యచతురత : నాకు చాలా తక్కువ. ఎవరైనా ఒక జోక్‌ చెబితే... ఒక్కోసారి అది జోక్‌ అని కూడా అర్థం కాదు అని అంటారు .
  • గొప్ప పొగడ్త : 'నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి' అని ఓసారి రజనీకాంత్‌గారు కాంప్లిమెంట్‌ ఇచ్చారు అని అన్నారు .
  • లక్ష్యం : భాష ఏదైనా ఫర్వాలేదు... నేను నటించే పాత్ర నాకు గుర్తింపు తెచ్చిపెట్టాలి. ఏడాదికి రెండు సినిమాల్లోనే నటించినా... అవి సూపర్‌హిట్లు కావాలి అని అంటారు .
ఫిల్మోగ్రఫీ :
 • జోష్ - మొదటి ఫిలిం
 • రంగం , 
 • ===============================
Visit website : dr.seshagirirao.com
 

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog