నరస రాజు డి వి , Narasa Raju D V

పరిచయం :
  • హాస్యరస ప్రధానమైన సంభాసన ల తో తెలుగు వానిని ఉర్రుతలుగించిన ప్రముఖ సిని రచయిత / దర్శకుడు డివినరసరాజు (86)చనిపోయారు . సుమారు 92 చిత్రాలకు రచయిత గా పనిచేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : నరసరాజు డి.వి , పూర్తి పేరు : దాట్ల వెంకట నరసరాజు ,
  • ఊరు : ఉయ్యందన తాళ్ళూరు , గుంటూరు జిల్లా ,
  • పుట్టిన తేది : 15 జూన్ 1920 ,
  • నివాసము : హైదరాబాద్ ,
  • చనిపోయిన తేది : 28 ఆగష్టు 2006, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా (natural)
  • పిల్లలు : ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు .
ఫిల్మోగ్రఫీ :
  • Writer:
  • 1. మనసు మమత (1990) (రైటర్)
  • 2. కారు దిద్దిన కాపురం (1986) (రైటర్)
  • 3. వయ్యారి భాములు వగలమారి భరతులు (1982) (రైటర్)
  • 4. యుగంధర్ (1979) (డైలాగ్)
  • 5. యమగోల (1975) (డైలాగ్)
  • 6. ఇద్దరు అమ్మాయిలు (1972) (డైలాగ్)
  • 7. మూగ నోము (1969) (డైలాగ్)
  • 8. బాంధవ్యాలు (1968) (డైలాగ్)
  • 9. భక్త ప్రహ్లాద (1967/ఇ) (అడప్తషన్) (డైలాగ్)
  • ... ఆక భక్త ప్రహ్లాద్ (ఇండియా: హిందీ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • ... ఆక భక్త ప్రహ్లాద (ఇండియా: తమిళ్ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • 10. భక్త ప్రహ్లాద (1967/ఈఈ) (రైటర్)
  • 11. చదరంగం (1967) (డైలాగ్) (స్టొరీ)
  • 12. గ్రిహలక్ష్మి (1967) (డైలాగ్)
  • 13. రామ్ ఆర్ శ్యాం (1967) (స్క్రీన్ప్లే) ( D.V. నరసరాజు) (స్టొరీ)
  • 14. రంగుల రత్నం (1966) (డైలాగ్)
  • 15. నాది ఆడ జన్మే (1965) (రైటర్)
  • 16. రాముడు భీముడు (1964) (రైటర్)
  • 17. గుండమ్మ కథ (1962) (డైలాగ్)
  • 18. మాన్-ముజి (1962) (స్టొరీ) (as D.V. నరసరాజు)
  • 19. మోహిని రుగ్మంగడ (1962) (రైటర్)
  • 20. రేణుకాదేవి మహత్యం (1960) (రైటర్)
  • 21. రాజా మకుటం (1959/ఇ) (డైలాగ్) (స్టొరీ)
  • 22. దొంగ రాముడు (1955) (డైలాగ్)
  • 23. పెద్దమనుషులు (1954) (రైటర్)
డైరెక్టర్: గా
  • 1. కారు దిద్దిన కాపురం (1986) 
డి.వి.నరసరాజు అలా దొరికారు
నరసరాజుగారిది బెజవాడ. శ్రీమంతులు. ఆయనకి నాటకాలు రాయడం సరదా. ఎన్నో ఆంగ్ల నాటకాలు చదివి, జీర్ణం చేసుకున్న అగస్త్యుడు. ఆయన ''నాటకం'' పేరుతో నాటకం రాశారు. అంతకుముందు - నాటికలు రాశారు. 'పాతాళభైరవి' (1951) శతదినోత్సవాలు చేసుకుంటూ విజయవాడ వెళ్లింది. పింగళి నాగేంద్రరావుగారిని, కె.వి.రెడ్డిగారే తెచ్చుకున్నా, ఆయన విజయాలో ఆస్థాన రచయితగా జీతం తీసుకుంటున్నారు. అంచేత కె.వి.రెడ్డి గారు కొత్త రచయిత కోసం అన్వేషణలో వున్నారు. ఆంధ్ర నాటక కళాపరిషత్తు నాటక పోటీల్లో 'నాటకం' నాటికానికి ఉత్తమ బహుమతులు వచ్చాయి - 'ఉత్తమ రచన'తో పాటు. శతదినోత్సవ సందర్భంగా, 'నాటకం' ప్రదర్శించి 'పాతాళభైరవి' బృందానికి చూపించారు. 'నాటకం' పూర్తి కాగానే కె.వి.రెడ్డి గారికి, నాటక రచయిత నరసరాజు మీద కన్నుపడింది. ఆయన్ని కలిశారు. మనసులో ఏర్పడిన అభిప్రాయాన్ని చెప్పలేదుగాని, ''ఎప్పుడైనా మద్రాసువస్తే కలవండి'' అన్నారు. అలాగే ఒకసారి మద్రాసు వెళ్లినప్పుడు వాహిని స్టూడియోలో కె.వి.రెడ్డి గారు, నరసరాజుగారు కలిశారు. మాటల్లో నరసరాజు మర్నాడే వెళ్లిపోతున్నట్టు చెప్పగా, కె.వి.గారు పక్కకు పిలిచి, మనసులోని మాట చెప్పేశారు. నరసరాజుగారు నిర్ఘాంతపోయారు! అంతే తర్వాత 'పెద్దమనుషులు' (1954) సినిమాకి రచయితగా ప్రవేశించి ఎన్నో చిత్రాలకు రచనలు చేశాడు. ఇదంతా ఎందుకంటే, నాటి దర్శకనిర్మాతలు రచయితల కోసం అన్వేషణ చేసేవారు. 'ప్రతిభ'ని గుర్తించేవారు. తన ప్రయత్నం ఏమాత్రం లేకుండా నరసరాజుగారు చిత్రరచయిత అయ్యారంటే, కారణం అదే. అదే ఆనాటి సంప్రదాయం.

courtesy @ Pathabangaram by Ravi kondalarao
  • =========================
visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala