నాగేశ్వరరావు ఏడిద , Nageswararao Edida

పరిచయం :
  • తెలుగు చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించిన సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు .
  • ఏడిద నాగేశ్వరరావు , ఒక సాదారణ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మొదలై అంచెలు అంచెలు గా ఎదిగి అగ్ర శ్రేణి నిర్మాత అయ్యారు . నిర్మాత కాకముందు సుమారు ౩౦ సినిమాల లో కొన్ని గుర్తింపు కలిగిన వేషాలు వేసారు . 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెపారు . కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే.
ప్రొఫైల్ :
  • పేరు : ఏడిద నాగేశ్వరరావు ,
  • ఊరు : కొత్తపేట -- ఈస్ట్ గోదావరి జిల్లా ,
  • నాన్న : సత్తిరాజు నాయుడు ,
  • అమ్మ : పాప లక్ష్మి ,
  • పుట్టిన తేది : 24-04-1934 .
  • నివాసము : కాకినాడ ,(నాన్న గారిది)
  • భార్య : జయలక్ష్మి -- 24 ఏప్రిల్ 1954 లో వివాహము జరిగినది .
  • పిల్లలు : ఒక అమ్మాయి ,ముగ్గురు అబ్బాయిలు
వేసిన కొన్ని నాటకాలు :
  • చదువు కున్న కాలము లో ఆడిన కొన్ని నాటకాలు :
  • లోభి - నాటకం లో తొలి వేసము ఆడవేసం.
  • దొంగ నాటకం ,
  • కప్పలు ,
  • వరప్రసాదం ,
  • విశ్వ భారతి ,
  • పరివర్తన ,
  • ఓటు నీకే ,
  • పంజరం ,
  • చెప్పుకింద పూలు ,
  • ఆడది ,
  • ఇన్స్పెక్టర్ జనరల్ ,
ఫిల్మోగ్రఫీ :
  • నిర్మాత గా : పూర్ణోదయా పతాకము పై ఎన్నో సినిమాలు నిర్మించారు అందులో కొన్ని :
  • 1.తాయారమ్మ బంగారయ్య ,
  • 2-సితార ,
  • 3.సీతాకోక చిలుక ,
  • 4.శంకరాభరణం ,
  • 5.స్వాతిముత్యం ,
  • 6.స్వయం కృషి ,
  • 7.ఆపద్భాందవుడు ,
  • 8. సిరిసిరిమువ్వ ,
  • 9. సాగరసంగమం ,
  • 10. స్వరకల్పన .

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala