Wednesday, October 22, 2008

కృష్ణ మురళి పోసాని , Krishna Murali Posani

పరిచయం :
 • గుంటూరు జెకెసి కళాశాలలో డిగ్రీ చదివిన పోసాని నాగార్జున యూనివర్సిటీలో పీజీ చేశారు. తర్వాత మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఫిల్‌ పూర్తి చేశారు. డాక్టరేట్‌ పరిశోధనను నిర్వహిస్తూ వస్తున్న సందర్భంలో సినీ రంగంపై ఏర్పడిన మక్కువతో దాన్ని అర్థాంతరంగా నిలిపేశారు.గాడ్‌ ఫాదర్లు లేక సినీ ఇండస్ట్రీలో కాలూనుకునేందుకు ఆయన తొలినాళ్లలో తీవ్రంగా శ్రమించారు. రోజుల గడవడం కోసం తొలినాళ్లలో థియేటర్లలో టికెట్‌ కౌంటర్లలో సైతం పనిచేశారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. అ తర్వాత సినీ రంగానికి సంబంధించిన పలు ఉద్యోగాలు చేశారు. అనంతరం చెన్నైలో పరుచూరి బ్రదర్స్‌ వద్ద అసిస్టెంట్‌గా దీర్ఘకాలం పనిచేశారు. తొలిసారిగా 'పోలీసు బ్రదర్స్‌' చిత్రం ద్వారా రచయితగా రంగ ప్రవేశంచేవారు. ఆయన రచనలో రూపుదిద్దుకున్న హిట్‌ చిత్రాల్లో గాయం, అల్లుడా మజాకా, ఖైదీ ఇన్స్‌పెక్టర్‌, పవిత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం, ప్రేయసి రావే, శివయ్య, స్నేహితులు, రక్షణ, సాంబయ్య తదితరాలు ఉన్నాయి. రచయితా గా 100 సినిమాలు చేసారు . నిర్మాతగా 'UP సినిమా లైన్స్' బ్యానర్ ద్వార " శ్రవణ మాసం " మొదటి సినిమా .
ప్రొఫైల్ :
 • పేరు : కృష్ణ మురళి పోసాని ,
 • పుట్టిన ఊరు : పెద్ద కాకాని - గుంటూరు జిల్లా .
 • మతము : హిందూ -కమ్మ
 • చదువు : యం.ఎ.(నాగార్జున యునివర్సిటీ),యం.ఫిల్(ప్రెసిడెన్సి కాలేజి -మద్రాస్)
 • నివాసం : హైదరాబాద్ ,
ఫిల్మోగ్రఫీ
 • రైటర్ గా :
 • ఆపదమొక్కులవాడు (2008)
 • ఆపరేషన్ దుర్యోధన (2007) (రైటర్)
 • రాఘవేంద్ర (2003) (డైలాగ్) (స్క్రీన్ప్లే) (స్టొరీ)
 • ఒరేయ్ తమ్ముడు (2001) (డైలాగ్) (స్టొరీ)
 • ఆఘాజ్ (2000) (స్టొరీ) (అస్ పోసాని కృష్ణ మురళి)
 • పెళ్ళిచేసుకుందాం (1997) (రైటర్)
 • గోకులంలో సీత (1997) (డైలాగ్)
 • మాస్టర్ (1997) (డైలాగ్) (అస్ కృష్ణ మురళి ప.)
 • అల్లుడా మజాకా...! (1995) (డైలాగ్) (స్టొరీ)
 • పోలీస్ బ్రదర్స్ (1994) (డైలాగ్) (స్టొరీ)
 • గాయం (1993) (డైలాగ్)
డైరెక్టర్ గా :
 • ఆపరేషన్ దుర్యోధన (2007)
 • ఆపద మొక్కులవాడు
యాక్టర్ గా :
 • గేన్మిని
 • అతడు
 • బొబ్బి(2002)

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog