సుబ్బులక్ష్మి యం యస్ , Subbulakshmi M S





పరిచయం :
  • ఆమె 'భారతరత్న.' శాస్త్రీయ సంగీత విదుషీమణి. ఆమె కీర్తనలు, కృతులు, సంకీర్తనలు, రాగాలాపనలూ వినని వారుండరు. ఆమె గురించి తెలియనివారూ వుండరు. మహాగాయనిగా జగద్విఖ్యాతి పొందిన ఆ సంగీత కళానిధి ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి. ఐతే, ఆమె పేరు చెప్పగానే మధుర స్వరాలు గుర్తొస్తాయిగాని, సినిమా నటీమణిగా కూడా రాణించి కీర్తి పొందిన విషయం గుర్తు రాదు.
  • సుబ్బులక్ష్మి! రామదున్ నువ్వేగానం చేయాలి " అని మహాత్మా గాంధీ చేత , నాదేముంది ? నేనుకొక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే! ఆమె సంగీత సామ్రాజ్యానికే మహారాజ్ఞి ... అని జవహర్ లాల్ నెహ్రూ చేత , తనభారత కోకిల " బిరుదును సుబ్బులక్ష్మి కిచ్చేస్తున్నాని సరోజినినాయుడు చేత , సుబ్బులక్ష్మి సంగీత విద్వాన్సులకే విద్వాంసురాలు " అని కామ్రేడ్ జ్యోతిబసు చేత " సరస్వతి వీణాపాణి -అయితే సుబ్బులక్ష్మి వీణా కన్ఠి " అని కరైకుడిసాంబశివ అయ్యర్ చేత , "ఆహా! ఏమి స్వరం? ఆ స్వరము లో ఎంత వశీకరణ శక్తి వుంది ? " అని చెంబై వైద్యనాధఅయ్యర్ చేత , ఇంక ఎంతో మంది ప్రసంశలు పొందిన మహనీయురాలు .
ప్రొఫైల్ :
  • పేరు : చిన్నారి కుంజమ్మ ,
  • వాసికెక్కిన పేరు : సుబ్బులక్ష్మి
  • పుట్టిన ఊరు :మదురై (మధుర మేనాక్షి కోవెల సమీపమో లో ) తమిళనాడు ,
  • పుట్టిన తేది : 16 సెప్టెంబర్ 1916
  • కుటుంబము : దేవదాసీ కుటుంబము ,
  • అమ్మమ్మ : అక్కమ్మాళ్ , వయోలిన్ కళాకారిణి ,
  • అమ్మ : షణ్ముఖ వదివు , వీణ విద్వాంసురాలు
  • నాన్న : సుబ్రమణ్య అయ్యర్ - న్యాయవాది .
  • తోబుట్టువులు : అన్నా , చెల్లెలు , అందరు సంగీత కళాకారులే ,
  • మాతృ భాష : తమిళం ,
  • భర్త : సదాశివం . పాత్రికేయుడు , ౧౯౯౭ లో మరణించారు
  • మరణము : 11 డిసెంబర్ 2004 - చని పోయిన "కౌసల్యా సుప్రజారామా !" అని ప్రతి ఉదయము మనల్నిమేల్కొలుపుతున్నారు .
కెరీర్ :
  • తన 12 వ ఏట నుండే సంగీత కచేరీలు చేసి ఎం.యస్. సుబ్బులక్షి గా మారేరు , 17 వ ఏట మద్రాసు మ్యూజిక్ అకాడమి లో చేసిన కచేరి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది . కచేరీలు చేస్తూ సినిమాలో నటించారు . సేవాసదనం సినిమా , శకుంతల సినిమా , 1940 లో పముఖ వ్యాపారి , పత్రిక విలేఖరి , స్వాతంత్ర్యోద్యమ నాయకుడు అయిన " సదాశివం " ను వివాహమాడినారు . వివాహము అనంతరము "మీరా " సినిమాలో నటించారు . నటించిన చివరి సినిమా " సావిత్రి " లో నారద పాత్రను వేసారు . వీరు కల్కి అనే పత్రికను నడిపేవారు .ఈమె తమిళం తో పాటు , తెలుగు , బెంగాల్ , కన్నడం , మలయాళం , గుజ రేట్ , హిందీ , సంసృతం లో ఎన్నో గీతాలు పాడేరు . ప్రముకము గా -మీరా భజనలు , కబీర్ దాస్ , సూరదాస్ , తలసేదాస్ , గురునానక్ ల భజనలు ,, అన్నమాచార్య కీర్తనలు ,క్స్తేత్రయ్య మువ్వగోపాలపదాలు , భక్తరామదాసు కీర్తనలు , భక్త తుకారం పద్యాలూ , తన కచేరీలలో ఆలపించారు .
  • మీరా' తర్వాత సుబ్బులక్ష్మి సినిమాలకు స్వస్తి చెప్పి, శాస్త్రీయ సంగీతం మీదనే మససు, దృష్టీ పెట్టి విరివిగా కచేరీలు చేసింది. కచేరీల ద్వారా వచ్చిన లక్షలాది రూపాయల్ని పేద ప్రజలకి అందజేసిందామె. నటించినవి ఐదేఐదు చిత్రాల్లో అయినా, అజరామరమైన ఖ్యాతి సంపాదించింది సుబ్బలక్ష్మి.
అవార్డులు :
  • 1954 లో "పద్మ భూషణ్ ,
  • 1968 లో మద్రాసు సంగీత అకాడమి వారి "సంగీత కళానిధి "
  • 1974 లో "రామన్ మేగాస్సే అవార్డు ,
  • 1988 లో మహారాష్ట్ర " మెంబర్ ది ఆనర్ "
  • 1988 లో " స్పిరిట్ అఫ్ ఫ్రీడం అవార్డు "
  • 1990 లో "ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా వార్డు ,
  • 1998 లో " భారతరత్న ,
నటించిన సినిమాలు :
  • సేవాసదనం 1938 ,
  • శకుంతల
  • సావిత్రి 1941 ,
  • మీరా 1945 ,

  • (Source : వార్తా తెలుగు దిన పత్రిక )

==========================




Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala