కనక లింగేశ్వర రావు బందా , Kanaka Lingeswararao Banda

పరిచయము :
  • బంద కనక లింగేశ్వర రావు , పద్మశ్రీ బిరుదు పొందిన , డ్రామా టిస్ట్. తెలుగు సినిమాల్లో మొట్టమొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్య (పృధ్వీపుత్ర: 1933; కుచేల: 1935). అయితే రెండో కృష్ణుడు బందా కనకలింగేశ్వరరావు (ద్రౌపదీ మానసంరక్షణం: 1936). నాటి నటులకి ముఖ్యమైన అర్హత చక్కని కంఠంతోపాటు పాట, పద్యం పాడడం. బందావారు రంగస్థలం మీద ఎన్నో పాత్రలు ధరించి పేరు తెచ్చుకొన్నా- 'కృష్ణ పాత్ర ఆయన అభిమాన పాత్ర' అని చెప్పుకొనేవారు. 'చిత్ర నళీయం' నాటకంలో బాహుకుడి పాత్రను అద్భుతంగా నటించేవారని పేరు. పలు రసాల రాగాల్లో పద్యాలు చదివేవారు.
  • బందావారు ధరించిన పాత్రల్లో ముఖ్యంగా చెప్పుకునేవిగా శ్రీక్రష్ణుడు, కాళిదాసు, బిల్వమంగళుడు, సారంగధరుడు, శ్రీరాముడు, కర్ణుడు, నలుడు, (బాహుకుడు), ప్రతాపరుద్రుడు, 'కన్యాశుల్కం'లో గిరీశం, సలీమ్‌, అల్లూరి సీతారామరాజు, చంద్రగుప్తుడు, విజయరామరాజు (బొబ్బిలి యుద్ధం) పానుగంటి వారి 'కంఠాభరణం'లో పిచ్చి రామశాస్త్రి, పేరిగాడి మొదలైనవి. రంగస్థల నటుల్లో వైవిధ్యమైన ఇన్ని పాత్రలు ధరించినవాళ్లు తక్కువ. ఎవరు ఏ పాత్రలో పేరు తెచ్చుకుంటే ఆ పాత్రనే ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునేవారు. కాని, బందావారి విషయంలో వేరుగా వుండేది. ఏ నాటకం వేసినా కనకలింగేశ్వరరావు గారుంటే చాలు- మంచి నటన, పద్యాలూ వుంటాయని జనం విరగబడేవారు. కురుపాం జమీందారుగారు 'అభినవకృష్ణ' అన్న బిరుదును, జయంపురం మహారాజా 'నటశేఖర' బిరుదునూ బందావారికి ప్రదానం చేశారు.
జీవిత విశేషాలు (Profile) :
  • పేరు : బందా కనకలింగేశ్వరరావు ,
  • పుట్టిన ఊరు : ఆటపాక --కైకలూరు మండలము -- కృష్ణా జిల్లా,
  • పుట్టిన తేదీ : 20 -జనవరి -1907 ,
  • చదువు : లాయర్ .. ఎక్కువకాలము ప్రాక్టీస్ చేయలేదు,
  • పిల్లలు : ఏడుగురు ఆడ పిల్లలు ,
  • మరణము : 03-Dec-1968 లో ఆయన మరణించిన తర్వాత, ఆటపాకలో ఆయన నిర్మించిన శివాలయం ఎదుట- ఆయన మీద వున్న భక్తి గౌరవాలకు చిహ్నంగా ప్రజలు - ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రఖ్యాతిగాంచిన ఒక నటుడికి ఇంతకంటే నివాళి ఇంకోటి ఏముంటుంది?
సినిమాలు (Filmography) :
  • బాలనాగమ్మ (1942) లో కార్యవర్ధి రాజూ (బాలనాగమ్మ భర్త )గా,
  • ద్రౌపదీ మాన సంరక్షణ (1936),
  • పాడుకా పట్టభిషేకం (1945),
  • సారంగధర 1937
మూలము : ఈనాడు సినిమా పేపరు .
  • ================================================
Visit my website -> Dr.Seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala