జంధ్యాల , Jandhyala


  •  
  •  
  •  


  •  
  • ======================= 

పరిచయం :
  • జంధ్యాల తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. జంధ్యాల అని ఇంటిపెరుతో సుప్రసిద్ధుడైనఆయన అసలుపేరు వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
జీవిత విశేషాలు
  • జననము : జంధ్యాల 1951 జనవరి 14 న
  • జన్మస్థలం : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోజన్మించారు.
  • చదువు : బి.కామ్ వరకు చదువుకున్నారు.
  • వృత్తి: తెలుగు కామెడీ డైరెక్టర్, డైలాగ్ రచయిత 
కెరీర్ :
  • చిన్నతనం నుండీ నాటకాల పట్ల ఆసక్తిగా ఉండేవారు. స్వయంగా నాటకాలు రచించారు కూడాను. ఆయన రాసిన నాటకాల్లో ఏక్ దిన్ కా సుల్తాన్, గుండెలు మార్చబడును ప్రముఖమైనవి. ఆయన నాటకాలు అనేక బహుమతులు అందుకున్నాయి. 1974 లో జంధ్యాల సినిమా రంగ ప్రవేశం చేసారు.
ఫిల్మోగ్రఫీ :
  • శంకరాభరణం,
  • సాగరసంగమం,
  • అడవిరాముడు,
  • వేటగాడు వంటి అనేక విజయవంతమైన సినిమాలకు మాటలు రాసారు.
  • ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారి,
  • శ్రీవారికి ప్రేమలేఖ వంటి చిరస్మరణీయ చిత్రాన్ని సృజించారు.
  • మరణము : జంధ్యాల 2001 జూన్ 19 న హైదరాబాదులో గుండె పోటుతో మరణించారు.
సినిమా ప్రస్థానం
  • మాటల రచయితగా తన సినిమా జీవితం మొదలుపెట్టిన జంధ్యాల, మంచి రచయితగా పేరు తెచ్చుకున్నాడరు. తరువాతి కాలంలో దర్శకుడిగా అవతారమెత్తి, అనేక హాస్యచిత్రాలను రూపొందించారు. ఆరోగ్యకరమైన హాస్యానికిజంధ్యాల పేరుగాంచారు. హాస్యబ్రహ్మ అని పేరుపొందారు.
జంధ్యాల చెణుకులు
  • * ఇంటిపేరుతోటే ప్రసిద్ధుడైన జంధ్యాలను మీ అసలు పేరు ఏమిటి అని అడిగితే ఆయన ఇలా అనేవాడు: "నేనురామానాయుడి గారి సినిమాకు పనిచేసేటపుడు నాపేరు జంధ్యాల రామానాయుడు, విశ్వనాథ్ గారి సినిమాకుపనిచేసేటపుడు నా పేరు జంధ్యాల విశ్వనాథ్..." అలా అనేవాడు తప్ప, తన అసలుపేరు ఎక్కడా చెప్పుకోలేదు.
  • * హాస్యం గురించి ఆయన ఇలా అనేవాడు: "నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒకరోగం"
జంధ్యాల పరిచయం చేసిన నటీనటులు జంధ్యాల తన సినిమాల ద్వారా అనేకమంది నటులను సినిమా రంగానికి పరిచయం చేసాడు. వారిలో కొందరు:
  • * నరేష్
  • * ప్రదీప్
  • * సుత్తి వీరభద్రరావు
  • * సుత్తి వేలు
 
  • ======================= 
visit my website : Dr.Seshagirirao-Srikakulam

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala