త్రిపురనేని గోపీచంద్ , Gopichand.T(Writer)

పరిచయం :
  • త్రిపురనేని గోపీచంద్ ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువుగా,తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
  • గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్రతెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు వచ్చింది.
జీవిత క్రమం : ప్రొఫైల్ :
  • పుట్టిన తేది: సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు.
  • తండ్రి, : త్రిపురనేని రామస్వామి చౌదరి-సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాdi
  • తల్లి : పున్నమాంబ.
  • జన్మ స్థలము : కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు.
  • హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది.
  • పెళ్లి : శకుంతల గోపీచంద్ (1932 లో వివాహం) ;1933లో
  • చదువు : బి,ఏ పట్టా ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో యిమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
రచనలు :
  • తర్వాత ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
  • 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
  • తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం(1943).
  • 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు.
  • 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
  • 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
మరణము :
  • 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
రచనలు-- నవలలు
  • అసమర్థుని జీవయాత్ర
  • గడియపడని తలుపులు
  • చీకటి గదులు
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
  • ప్రేమోపహతుల
  • పరివర్తన
  • యమపాశం
  • శిధిలాలయం
వాస్తవిక రచనలు
  • తత్వవేత్తలు
  • పోస్టు చేయని ఉత్తరాలు
  • మాకూ ఉన్నాయి సొగతాలు

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala