కావేరి (కళ్యాణి)-Kaveri(Kalyani)


పరిచయం :

మళయాలం నటి కల్యాణి యే కావేరి గా పేరు మార్చు కున్నారు. ఈమె మళయాలి నటి సుజిత సోదరుడైన సూర్యకిరణ్ ని 01 మె 2007 లో పెళ్లి చేసుకున్నారు. 

profile :  

  • పేరు : కల్యాణి ,

    ఊరు : కేరళలోని తిరువళ్ళ , 

  • కుటుంబము : ఈమె ఇంట్లో పెద్దెమ్మాయి. 

 

  •  కెరీర్ :  

అమ్మ ముందునుంచీ నన్ను బాగా చదివించాలనుకుంది. దంత వైద్యురాల్ని చేయాలనుకునేది. నేనూ బాగా చదువుకునేదాన్ని. క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేదాన్ని. నానమ్మ, తాతయ్య ఆ రోజుల్లో నలుపు తెలుపు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. నాన్న కూడా రకరకాల సంగీత వాద్యాలు వాయించేవారు. ఈ వాతావరణంలో పెరిగిన నాకు ముందునుంచీ నటనపై ఆసక్తి ఉండేది. ఇంట్లో కుదిరినప్పుడల్లా అమ్మ చీరను కట్టుకుని వివిధ పాత్రల్లో నటించే ప్రయత్నం చేసేదాన్ని. నన్ను అలా చూశాక అమ్మకు కూడా నన్ను నటిని చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ సమయంలోనే మా నాన్న బంధువొకరు 'సినిమాలో బాలనటి కావాలట, నువ్వు నటించు' అన్నారు. అలా 'అమ్మనమ్‌ కిలీ' అనే సినిమాలో నటించా. తరవాత వరుసగా పన్నెండు సినిమాల్లో బాలనటిగా చేశా.

మమ్ముట్టితో మొదటిసారి..
కొన్నేళ్లు గడిచేసరికి బాలనటి అవకాశాలు తగ్గాయి. మళ్లీ చదువుపై దృష్టిపెట్టా. చదువుకుంటూనే చిన్నచిన్న పాత్రలు చేసేదాన్ని. అప్పుడే మమ్ముట్టి హీరోగా నిర్మించే ఓ సినిమాలో నాయికగా నటించే అవకాశం వచ్చింది. అప్పటికప్పుడు స్క్రీన్‌ టెస్ట్‌ చేసి నన్ను ఆ పాత్రకు ఎంపిక చేశారు. అదే నా మొదటి సినిమా 'ఉద్యానపాలకన్‌' (తోటమాలి). తరవాత కొన్ని మలయాళ సినిమాల్లో కూడా నటించాను. ఒకరోజు రాజశేఖర్‌ హీరోగా సినిమా తీస్తున్నారని తెలిసి అవకాశం లభిస్తుందేమోనని వెళ్లా. వెంటనే ఎంపికయ్యా. అదే 'శేషు'. మొదటిరోజు షూటింగ్‌ సమయంలో జీవితక్క నా పక్కనుండి డైలాగులు చెప్పించింది. నాకయితే ఒక్కముక్కా అర్థం కాలేదు. షూటింగ్‌ అవగానే రూంకెళ్లి 'నా వల్ల కాదు.. నేను చేయలేను..' అంటూ ఏడ్చేశా. 'రేపు మరోసారి ప్రయత్నించు. అప్పుడు కూడా కష్టం అనిపిస్తే, చేయలేనని అనుకుంటే వెళ్లిపోదాం' అని చెప్పింది. మర్నాడూ కాస్త భయంగానే షూటింగ్‌కి వెళ్లా సాయంత్రం వరకూ ఏ ఒత్తిడీ లేదు. చేయగలనన్న నమ్మకం కలిగింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ అలాగే చేస్తున్నా. శేషు విడుదల సమయంలో హైదరాబాద్‌కి వచ్చా. అప్పుడే జీవితక్క 'నీకు మరో సినిమా సిద్ధంగా ఉంది. వంశీ గారిది..' అంది. అప్పటికి వంశీ ఎవరో తెలియదు. పక్కనే ఉన్న నెట్‌కి వెళ్లి చూశా. పెద్ద దర్శకుడు అని అర్థమైంది. ఒప్పుకొన్నా. అదే 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..'. నా అసలు పేరు కావేరి. ఇక్కడికొచ్చాకే కల్యాణిగా మార్చారు.

ఒకే పువ్వు...
'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'లో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఫొటో షూట్‌ అప్పుడు బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో కనిపించేలా తయారవ్వమన్నారు. దానికితోడు పెద్ద బొట్టు. నాకేమో తలనిండా పూలు పెట్టుకోవడం అంటే ఇష్టం. కానీ ఒకే పువ్వును చెవి దగ్గర పెట్టుకోమన్నారు. ఇదేమిటి వెరైటీగా ఉందనుకున్నా. నవ్వొచ్చేది కూడా. తీరా ఫొటోలొచ్చాక చాలా ఆనందం కలిగింది. సినిమా ఎంత పేరు తెచ్చిపెట్టిందో చెప్పేదేముంది! తరవాత 'పెళ్లాంతో పనేంటి'.. 'వసంతం'.. 'కబడ్డీ కబడీ'.. 'దొంగోడు'... లాంటివి చాలానే చేశా.

చదువుకోవాలనుకుంటున్నా...
పెదబాబు చేస్తున్నప్పుడు మా వారు సూర్యకిరణ్‌ పరిచయం అయ్యారు. తరవాత జరిగిన కార్యక్రమాల్లో రెండుమూడు సార్లు కలిశాం. ప్రేమ అని చెప్పను కానీ తరవాత పెద్దవాళ్లు మాట్లాడుకున్నారు. 2005లో మా పెళ్లయింది. తరవాత రక్ష, లక్ష్యం లాంటి కొన్ని సినిమాలు చేశా. ఈ మధ్య 'లెజెండ్‌'లో నటించా. పాత్ర నిడివి చిన్నదే కావచ్చు, కానీ గుర్తింపు లభించింది. జగపతి బాబు గారినీ, నన్నూ హిట్‌ పెయిర్‌ అంటుంటారు. ప్రస్తుతం ఆయనతో కలిసి 'ఓ మనిషి కథ', 'రారా కృష్ణయ్య' చేస్తున్నా. నేను నటించిన 'ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు'కి నంది అవార్డు వచ్చింది. సామాజిక అంశం ప్రధాన ఇతివృత్తంగా తీసిన 'హోప్‌'లో నటనకు జాతీయ అవార్డు వచ్చింది. నేను చదివింది ఇంటరే. ఖాళీ దొరికితే దూరవిద్యలో ఏదయినా చదువుకోవాలనీ, మరేదయినా చేయాలనీ ఆలోచన ఉంది.-- source : Eenadu Vasundara.net.


కావేరి నటించిన తెలుగు చిత్రాలు

  • శేషు ,
  • ఔను, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు .
  • లేత మనసులు"
  • పెళ్లాంతో పనేంటి ,
  • వసంతం ,
  • ధన 51 ,
  • హైదరాబాద్ ,
  • కబాడీ కబడి ,
  • పందెం ,
  • లక్ష్యం .
  • రక్ష .
  • పెదబాబు .
  • ===============================
Visit my website : Dr.Seshagirirao.com
  •  

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala